బరువు తగ్గడం వల్ల అవకాశాలు తగ్గలేదు... కానీ...

తెలుగులో పలు చిత్రాల్లో కమెడియన్ పాత్రలు మరియు హీరోయిన్ స్నేహితురాలి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తమిళ బొద్దుగుమ్మ “విద్యుల్లేఖ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే విద్యుల్లేఖ ఆ మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “సరైనోడు” చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 Telugu Actress Vidyullekha About Her Movie Offers After Weight Loss, Telugu Actr-TeluguStop.com

కాగా ఈ మధ్య కాలంలో విద్యుల్లేఖ దాదాపుగా ఇరవై కేజీలకు పైగా బరువు తగ్గింది.దీంతో అందరూ సినిమా అవకాశాల కోసం విద్యుల్లేఖ బరువు తగ్గిందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే తాజాగా విద్యుల్లేఖ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొందరు నెటిజన్లు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది.అందులో భాగంగా ఓ నెటిజన్ బరువు తగ్గిన తర్వాత మీకు సినిమాల్లో నటించే అవకాశాలు తగ్గి పోయాయా.? అని ప్రశ్నించాడు.దీంతో విద్యుల్లేఖ ఈ విషయంపై స్పందిస్తూ తను బరువు తగ్గిన తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు తగ్గి పోలేదని స్పష్టం చేసింది.

అంతేగాక తాను ఇటీవల మరో రెండు కొత్త చిత్రాలలో నటించే అవకాశాలు కూడా దక్కించుకున్నానని తెలిపింది.అలాగే సినిమా అవకాశాలు ఎప్పుడూ కూడా మన నటన ప్రతిభ ఆధారపడి ఉంటాయని అంతేతప్ప మన శరీరాకృతికి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చింది.

అయితే తన టార్గెట్ 67 కేజీల బరువు కి చేరుకోవాలని కూడా తెలిపింది.

Telugu Offers, Telugu Actress, Teluguactress, Tollywood, Vidyullekha, Lose-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా విద్యుల్లేఖ గత ఏడాది ఆగస్టు నెలలో సంజయ్ అనే వ్యక్తి తో నిశ్చితార్థం చేసుకుంది.కానీ పెళ్లి చేసుకునేలోపే కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో కొంతకాలం పాటు పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం.కాగా ప్రస్తుతం విద్యుల్లేఖ తెలుగులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న “గల్లీ రౌడీ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube