మా ఇద్దరి మధ్యలో లవ్ లేదంటున్న వర్ష... కానీ...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే  “ఎక్స్ట్రా జబర్దస్త్” కామెడీ షో ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ షోలో ఈ మధ్య కొత్తగా “కెవ్వు కార్తీక్”  తన స్కిట్లతో ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు.  అయితే కెవ్వు కార్తిక్ టీమ్ లో కమెడియన్ గా పని చేస్తున్నటువంటి వర్ష మరియు ఇమ్మాన్యుయేల్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడంతో ప్రేక్షకులని బాగానే కనెక్ట్ అవుతున్నారు.

 Telugu Actress Varsha Gives Clarity About Love Affair With Comedian Emmanuel, Va-TeluguStop.com

 దీంతో వర్ష కి సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోయింగ్ ఓ రేంజిలో పెరిగిపోయింది.

దీంతో కొందరు వర్ష మరియు ఇమ్మాన్యుయేల్ ప్రేమలో పడ్డారని తొందర్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారాలను చేస్తున్నారు.

 కాగా ఇటీవలే ప్రసారం అయినటువంటి ఎపిసోడ్ లో వర్ష ఈ విషయంపై స్పందిస్తూ ఇమ్మాన్యుయేల్ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చింది. అంతేకాక ఇమ్మాన్యుయేల్ మనసు చాలా మంచిదని, తనలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి  స్నేహితుడిగా దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

 అంతేకాక అందానికి, రంగుకి సంబంధం లేదని ఇమ్మాన్యుయేల్ కి రంగుకి మించిన మంచి మనసు ఉందని తనకు అది చాలని పరోక్షంగా తన మనసులో మాటను తెలిపింది.ఇక తమ కెమిస్ట్రీ గురించి స్పందిస్తూ కేవలం స్కిట్ లో కామెడీ పండించడానికి మాత్రమే తాము అంత క్లోజ్ గా ఉంటామని స్పష్టం చేసింది.

దీంతో వర్ష చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆన్ స్క్రీన్ పై క్లోజ్ గా నటించినంత మాత్రాన వారు ప్రేమలో పడినట్లు కాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 మరికొందరు మాత్రం ఒకప్పుడు రష్మి సుదీర్ ల జంట సూపర్ హిట్ అని ఇప్పుడు వారికి వర్ష ఇమాన్యుల్ క్రేజ్ పరంగా పోటీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు. దీంతో కొందరు సుడిగాలి సుదీర్ అభిమానులు స్పందిస్తూ రష్మి సుదీర్ ల జోడి ఎవర్ గ్రీన్ హిట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube