వైరల్ అవుతున్న దేవి చిత్ర హీరోయిన్ మూడో పెళ్లి ఫోటోలు….  

Telugu Actress Vanitha Vijaykumar Third Marriage Photos Viral In Social Media - Telugu Devi, Petar Paul, Telugu Actress, Third Marriage Photos, Vanitha Vijaykumar

తెలుగులో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన  దేవి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన  ముద్దుగుమ్మ  “వనిత విజయ్ కుమార్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె తెలుగు లో నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ పలు వివాదాలకు కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో బాగానే పాపులర్ అయ్యింది.

 Telugu Actress Vanitha Vijaykumar Third Marriage Photos Viral In Social Media

కాగా అవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉన్నాయి.అయితే తాజాగా వనిత విజయ్ కుమార్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా ఇటీవలే వనిత విజయ్ కుమార్ తమిళ సినీ పరిశ్రమకి చెందినటువంటి పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంతమంది బంధువులు సన్నిహితుల మధ్య ఈ పెళ్ళి జరిగినట్లు సమాచారం.

వైరల్ అవుతున్న దేవి చిత్ర హీరోయిన్ మూడో పెళ్లి ఫోటోలు….-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో తాజాగా వనిత విజయ్ కుమార్ తన వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.దీంతో కొందరు నెటిజన్లు వనిత విజయ్ కుమార్ కి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మనుషులన్న తర్వాత జీవితంలో ఒక్కోసారి తప్పటడుగులు వేస్తుంటారు కానీ వెంటనే సరిదిద్దుకో కాకపోతే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని కాబట్టి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సుఖ సంతోషాలతో జీవితం గడపాలంటూ దీవిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా వనిత విజయ్ కుమార్ తెలుగు, తమిళ్, మలయాళం, భాషలలో కలిపి దాదాపుగా ఏడు చిత్రాలలో నటించింది అయితే   తరువాత చిత్ర కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువ కాలం పాటు వనిత సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

అయితే తెలుగులో ఈ అమ్మడు నటించిన టువంటి దేవి చిత్రం మాత్రం ఇప్పటికీ చాలామందికి తమ ఫేవరేట్ చిత్రాల లిస్టులో ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actress Vanitha Vijaykumar Third Marriage Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..

footer-test