ఈ నటి తన భర్తని ఉదయం ప్రేమించి సాయంత్రం గుడిలో పెళ్లి చేసుకుందట...

పలు టాలీవుడ్ చిత్రాలలో అమ్మ, అక్క, వదిన, చెల్లెలు, తదితర పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి శివమణి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఎంతో చక్కగా మరియు పద్ధతిగా ఉండే తులసి శివమణి ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో చక్కగా ఒదిగిపోతూ సెంటిమెంటల్ సన్నివేశాలను పండిస్తుంది.

 Telugu Actress Tulasi Shivamani And Sivamani React About Her Marriage, Tulasi Sh-TeluguStop.com

ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తులసి సెల్వమణి పాల్గొని తన పెళ్లి విషయం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అయితే ఇందులో భాగంగా తనకి అప్పట్లో కన్నడ భాషలో “మదర్ ఇండియా” అనే చిత్రంలో నటించే అవకాశం రావడంతో తాను చెన్నై కి వెళ్లానని ఈ క్రమంలో దర్శకుడు సెల్వమణి ని షూటింగ్ లో కలుసుకున్నానని తెలిపింది.

అయితే తాను తన భర్త సెల్వమణి చూడడం అదే మొదటి సారి అని కూడా చెప్పుకొచ్చింది.సెల్వమణి ని చూడగానే తనలో ప్రేమ లాంటి భావన కలిగిందని, కానీ తనకి ప్రేమ ప్రపోజ్ చేసింది మాత్రం మొదటగా తన భర్త సెల్వమణి అని తెలిపింది.

ఆ తర్వాత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరూ దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నానని తెలిపింది.కానీ ఇదంతా జరిగింది కేవలం ఒక్క రోజులోనే అని చివర్లో షాక్ ఇచ్చింది.

అయితే ఒక్క రోజులోనే ప్రేమ పుట్టడం, ఆ ప్రేమ పెళ్లి కి దారితీయడం అంతా కలలో జరిగినట్లుగా జరిగిపోయిందని తులసి సెల్వమణి చెప్పుకొచ్చింది.అయితే తన భర్తకు మొదట్లో సిగరెట్ కాల్చే అలవాటు బాగా ఉండేదని కానీ తాను పొగ ఎలర్జీ వల్ల బాధపడుతున్నానని తెలుసుకున్నప్పటి నుంచి సిగరెట్ కాల్చడం మానేశాడని చెప్పుకొచ్చింది.

అది తన గొప్పతనం కాదని తమ ప్రేమ గొప్పతనమని కూడా స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో తులసి సెల్వమణి దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

ఇప్పటికీ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అమ్మ పాత్రలు చేయాలంటే ఎక్కువ మంది దర్శకనిర్మాతలు నటి తులసి సెల్వమణి సంప్రదిస్తుంటారు అంతగా తులసి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube