నా భర్త వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ ఎమోషనల్ అయిన స్వాతి నాయుడు....

ఒక్కోసారి కొంతమంది నూతన నటీనటులు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎలాగైనా సరే ఒక్క అవకాశాన్ని దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తుంటారు.ఈ క్రమంలో కొందరికి తమ సినీ కెరీర్ ని మలుపు తిప్పే అవకాశాలు తలుపు తడితే మరికొందరికి మాత్రం తాము నటించిన పాత్రలు శాపంగా మారి పూర్తి సినీ జీవితాన్ని కోల్పోతుంటారు.

 Telugu Actress Swathi Naidu Emotional About Her Husband Care Less-TeluguStop.com

అయితే తెలుగులో పలు శృంగార భరిత చిత్రాలలో నటించి తెలుగు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి “స్వాతి నాయుడు” కూడా ఈ కోవకే చెందుతుంది.అయితే ఈ అమ్మడు హీరోయిన్ కావాలని సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది.

ఈ క్రమంలో అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేసింది.కానీ దురదృష్టవశాత్తు ఒక్క అవకాశాన్ని కూడా దక్కించుకోలేక పోయింది.

 Telugu Actress Swathi Naidu Emotional About Her Husband Care Less-నా భర్త వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ ఎమోషనల్ అయిన స్వాతి నాయుడు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కుటుంబ పోషణ మరియు తన సిని భవిష్యత్తు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని డబ్బు కోసం శృంగార భరిత తరహా చిత్రాలను నటించింది.అయినప్పటికీ ఈ అమ్మడి సినీ కెరీర్ ఏ మాత్రం మలుపు తిరగలేదు.

కాగా స్వాతి నాయుడు 2019వ సంవత్సరంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి చేసుకునే సమయంలో ఇరువురు పరస్పరం అంగీకారంతో అలాగే ఒకరినొకరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు స్వాతి నాయుడు అప్పట్లో తెలిపింది.

కానీ పెళ్లయిన కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో ఇరువురు వేరుగా ఉన్నట్లు సమాచారం.కాగా ఇటీవలే స్వాతి నాయుడు ఈ విషయం గురించి తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఓ వీడియోలో స్పందించింది.

ఇందులో తన ఇంట్లో గోడలు, సోఫా సెట్లు, వస్తువుల మాదిరిగానే తన భర్తకి కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేవని తాను ఏడ్చిన, నవ్వినా అలాగే తన కూతురి బాగోగులను కూడా అసలు పట్టించుకోడని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.దీంతో కొందరు స్వాతి నాయుడు అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ ఒక్కోసారి మన జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాటన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని కాబట్టి ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో స్వాతి నాయుడు తండ్రి కూడా తనని ఆర్థిక పరంగా మోసం చేసినట్లు తెలిపింది.అంతేకాక తాను పలు చిత్రాల్లో నటించిన సమయంలో వచ్చిన పారితోషకం తన తండ్రికి ముట్ట చెప్పేదాన్నని కానీ పెళ్లయిన తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఇంట్లో నుంచి గెంటేశారని వాపోయింది.కాగా ప్రస్తుతం స్వాతి నాయుడు హైదరాబాదు పరిసర ప్రాంతంలో తన కూతురు బాగోగులు చూసుకుంటూ ఒంటరిగా నివాసముంటున్నట్లు సమాచారం.

#SwathiNaidu #Swathi Naidu #TeluguActress #B Grade Films

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు