ఈ నటుడి కూతురు తెలుగులో స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?  

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోలతో కలిసి హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ “సుహాసిని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే నటి సుహాసిని తన సినిమా జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎప్పుడు అందరితోనూ కలివిడిగా మాట్లాడుతూ సరదాగా ఉంటుంది.

 Telugu Actress Suhasini Father Charuhasan News-TeluguStop.com

ఇక నటన పట్ల కూడా ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ చీర కట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంది.అందువల్లనే ఒకప్పుడు హీరోయిన్ గా నటించినా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

అయితే సుహాసిని పూర్తీ పేరు సుహాసిని హాసన్.కాగా సుహాసిని తండ్రి చారు హాసన్ అప్పటికే సినిమా పరిశ్రమలో మంచి పేరున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక చారు హాసన్ సోదరుడు కమల్ హాసన్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.అంతేగాకుండా ఇటీవలే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా ఓ పార్టీని కూడా స్థాపించాడు.

 Telugu Actress Suhasini Father Charuhasan News-ఈ నటుడి కూతురు తెలుగులో స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ చారు హాసన్ కి ప్రస్తుతం వయసు మీద పడటంతో అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఇక సుహాసిని భర్త ప్రముఖ దర్శకుడు మణిరత్నం గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం లేదు.

గతంలో ఓ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న సమయంలో సుహాసిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ప్రస్తుతం నందన హాసన్ అనే బాబు కూడా ఉన్నాడు.

కాగా ఇటీవలే తమిళనాడులో జరిగిన ఎన్నికలలో కమల్ హాసన్ కూతురైన అక్షర హాసన్ తో కలిసి సుహాసిని తన బాబాయ్ పార్టీ తరుపున ప్రచారం కూడా చేసింది.

కాగా నటి సుహాసిని కేవలం నటిగా మాత్రమే కాకుండా డైలాగ్ రైటర్, అసిస్టెంట్ కెమెరామెన్, అసిస్టెంట్ డైరెక్టర్, అలాగే మూడు చిత్రాలకి దర్శకురాలిగా కూడా పని చేసింది.కాగా ప్రస్తుతం సుహాసిని తన భర్త మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే తమిళంలో ఓ ఫ్యామిలి ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#Charu Hasan #Suhasini #Kamal Hasan #Kollywood #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు