ఈ సీరియల్ హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా..?  

Telugu actress Suhasini Cine Career News, Suhasini, Telugu heroine, Telugu serial actress, Tollywood, Dharma, Serial Actor, iddaru ammayilu - Telugu Dharma, Iddaru Ammayilu, Serial Actor, Suhasini, Telugu Actress Suhasini Cine Career News, Telugu Heroine, Telugu Serial Actress, Tollywood

తెలుగులో అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించినటువంటి “చంటిగాడు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “నటి సుహాసిని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె పలు టాలీవుడ్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా బుల్లితెరపై కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే రాణించింది.

TeluguStop.com - Telugu Actress Suhasini Cine Career News

కాగా అప్పట్లో సుహాసిని నటించినటువంటి చంటిగాడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా మ్యూజికల్ పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో సుహాసినికి వరుస సినీ అవకాశాలు క్యూ కట్టాయి.

కానీ తన తదుపరి చిత్ర కథల విషయంలో సుహాసిని సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో ఒకానొక సమయంలో ఈమె నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.దీంతో సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో ఇక చేసేదేమీలేక సీరియళ్లలో కూడా నటించడానికి సిద్ధమైంది.

TeluguStop.com - ఈ సీరియల్ హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే “అపరంజి” అనే సీరియల్ ద్వారా బుల్లితెరకి  ఎంట్రీ ఇచ్చింది.ఇక అప్పుడప్పుడు అడపా దడపా మాత్రమే వెండితెర లో నటిస్తోంది.

కాగా 2016వ సంవత్సరంలో బుల్లితెర జీ తెలుగులో ప్రసారమయ్యేటువంటి “ఇద్దరు అమ్మాయి” ధారావాహికలో నటిస్తున్న సమయంలో ధర్మ అనే సీరియల్ నటుడితో ప్రేమలో పడింది.దీంతో ఇరువురి కుటుంబ పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

 కాగా ప్రస్తుతం నటి సుహాసిని ఒకపక్క సీరియళ్లలో నటిస్తూనే మరో పక్క పలు సీరియళ్లకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

#Iddaru Ammayilu #Dharma #TeluguSerial #TeluguActress #Suhasini

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actress Suhasini Cine Career News Related Telugu News,Photos/Pics,Images..