అలాంటి ఫోటోలను షేర్ చేస్తూ సమంత వ్యాపారం చేస్తోందంటున్న శ్రీ రెడ్డి...  

గతంలో తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి పోరాటం చేస్తూ అనుకోని విధంగా టాలీవుడ్ పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” పై పలు వ్యక్తిగత విమర్శలు చేయడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు బహిష్కరణకు గురైన తెలుగు నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అయితే నటి శ్రీ రెడ్డి బహిష్కరణకు గురైనప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాలలో పలువురు టాలీవుడ్ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.

TeluguStop.com - Telugu Actress Sri Reddy Sensational Comments Star Heroine Samantha Akkineni

ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని పై తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసి మరోమారు వార్తల్లో నిలిచింది.అయితే ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ “అక్కినేని సమంత” తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమేర బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసింది.

 దీంతో తాజాగా శ్రీ రెడ్డి ఈ ఫోటోలపై స్పందిస్తూ ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత వ్యాపారం చేస్తోందని, అంతేగాక ఇప్పటికే తన చిత్రాల ద్వారా సమంత వంద తరాలు తిన్నా తరగనటువంటి ఆస్తులను సంపాదించిందని అంటూ సమంత ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ చేసింది.

TeluguStop.com - అలాంటి ఫోటోలను షేర్ చేస్తూ సమంత వ్యాపారం చేస్తోందంటున్న శ్రీ రెడ్డి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో శ్రీ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

 అంతేగాక కొంతమంది సమంత అభిమానులు శ్రీ రెడ్డి ని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం  శ్రీ రెడ్డి ఇలాంటి సంచలన వ్యాఖ్యలను చేయడం కొత్తేమి కాదని పెద్దగా పట్టించుకోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీ రెడ్డి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో నివాసం ఉంటోంది.అలాగే పలు రకాల వంటల వీడియోలు మరియు అందంగా కనిపించడానికి ఉపయోగించేటటువంటి చిట్కాలు వంటి వాటికి సంబందించిన వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో విడుదల చేస్తూ బాగానే రాణిస్తోంది.’

.

##సమంత #Sri Reddy #Facebook #TeluguActress #Star Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు