ఆ హీరోయిన్ డబుల్ గేమ్స్ ఆడుతోంది... కానీ నేనలా కాదు....

గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నెపోటిజం మరియు డ్రగ్స్ తదితర విషయాలపై తన నిరసనను తెలియజేస్తున్న సంగతి అందరికీ తెలిసింది.ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు కంగనా రనౌత్ పోలీసుల విచారణకు కూడా హాజరైంది.

 Telugu Actress Sri Reddy Sensational Comments On Kangana Ranaut Double Game-TeluguStop.com

దీంతో ఈ అమ్మడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే కక్ష సాధిస్తున్నారని ఇప్పటికే కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి కూడా తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించింది.

అయితే ఇందులో భాగంగా కంగనా రనౌత్ కూడా మొదట్లో తనలాగే అవకాశాల కోసం వచ్చి మోసపోయిన< మాట వాస్తవమే అయినప్పటికీ ఆమెలో నిజాయితీ లేదని డ్రగ్స్ తీసుకుందని పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేకాకుండా నెపోటిజం, డ్రగ్స్ విషయంలో కంగనా రనౌత్ డబుల్ గేమ్ ఆడిందని అది సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 Telugu Actress Sri Reddy Sensational Comments On Kangana Ranaut Double Game-ఆ హీరోయిన్ డబుల్ గేమ్స్ ఆడుతోంది… కానీ నేనలా కాదు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా తనకి ఏ పార్టీని సపోర్ట్ చేసే ఉద్దేశం లేదని కేవలం న్యాయం కోసం మాత్రమే నిలబడతానని కూడా తెలిపింది.

అలాగే ప్రస్తుతం కంగనా రనౌత్ కి ఓ అనుభవం ఉన్న మెంటల్ డాక్టర్ అవసరం ఉందని, కాబట్టి వెంటనే వెళ్లి వైద్య చికిత్స తీసుకోవాలని కూడా సూచించింది.

దీంతో కొందరు కంగనా రనౌత్ అభిమానులు శ్రీ రెడ్డిని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా కంగనా రనౌత్ కి, నీకు చాలా తేడా ఉందని కాబట్టి ముందు ఆమె అర్హత, హోదా, ఏంటో తెలుసుకుని మాట్లాడాలని శ్రీ రెడ్డికి సూచిస్తున్నారు.

అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో సినీ సెలబ్రిటీల విషయాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం శ్రీ రెడ్డికి కొత్తేమీ కాదు.గతంలో కూడా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కెరియర్ పై స్పందిస్తూ తొందర్లోనే అల్లు అర్జున్ సినిమా కెరియర్ పతనం కాబోతుందంటూ జోస్యం చెప్పింది.

దీంతో మరోమారు అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి కూడా గురైంది.అయినప్పటికీ శ్రీరెడ్డి మాత్రం ఏమాత్రం మారకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#Kangana Ranaut #DrugsIssue #Nepotism #TeluguActress #Sri Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు