చిరంజీవిని పార్టీ లోకి తీసుకోవద్దంటూ జగన్ ని రిక్వెస్ట్ చేస్తున్న శ్రీ రెడ్డి...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు మరియు లైంగిక వేధింపులను అరికట్టాలంటూ పోరాటం చేసి నానా హంగామా చేసిన తెలుగు ప్రముఖ నటి “శ్రీ రెడ్డి” గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు అనుకోకుండా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అతడి తల్లిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైంది.

 Telugu Actress Sri Reddy Requesting To The Jagan Mohan Reddy-TeluguStop.com

దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకుని తన ఆక్రోశాన్ని వెల్లగక్కుతోంది.

కాగా తాజాగా శ్రీ రెడ్డి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై తన అధికారిక  ఫేస్ బుక్ ఖాతా ద్వారా వీడియోని షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 Telugu Actress Sri Reddy Requesting To The Jagan Mohan Reddy-చిరంజీవిని పార్టీ లోకి తీసుకోవద్దంటూ జగన్ ని రిక్వెస్ట్ చేస్తున్న శ్రీ రెడ్డి… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి వైయస్సార్ సిపి పార్టీ లోకి తీసుకోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కోరింది.అంతేకాకుండా వై.కా.పా పార్టీ లో ఎనలేని సేవలు అందించిన నాయకులు చాలా మంది ఉన్నారని కాబట్టి వారికి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుందని అంతేతప్ప  రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి చివరికి ఆ పార్టీని నిలబెట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన నాయకులకి పదవులను అప్పజెప్పితే పార్టీకే ప్రమాదమని హెచ్చరించింది.

అంతేకాక తన నుంచి కేవలం మెగాస్టార్ చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించద్దనే రిక్వెస్ట్ ని మన్నించాలని కోరింది.దీంతో మెగా అభిమానులు శ్రీ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఓ వ్యక్తకి  తన పార్టీ ప్రయోజనాలు మరియు తన రాష్ట్ర ప్రజల సంక్షేమం వంటి వాటి గురించి బాగానే అవగాహన ఉంటుందని కాబట్టి ఎవరిని పార్టీలోకి తీసుకుంటే పార్టీ బాగుంటుందో అతడికి బాగా తెలుసని మీ సలహాలేమీ అక్కర్లేదని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే శ్రీ రెడ్డి తెలుగులో “క్లైమాక్స్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది అంతేకాక ఇప్పటికీ చాలా మందికి ఈ చిత్రం కనీసం మొదలైనట్లు కూడా తెలియదు.దీంతో శ్రీ రెడ్డి తను నటించిన చిత్రాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అవుతోంది.

#Sri Reddy #TeluguActress #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు