నిన్న అల్లు అర్జున్.. నేడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి...

తెలుగులో ఒకప్పుడు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి “మీటూ” ఉద్యమానికి తెరలేపిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ మీటూ ఉద్యమం కారణంగా కొంతమంది నటీనటులకు మంచి జరిగినప్పటికీ అనుకోకుండా శ్రీ రెడ్డి ఓ టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు ఆమె తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ శ్రీ రెడ్డిని బహిష్కరించింది.

 Telugu Actress Sri Reddy Negative Trolls On Allu Arjun And Pawan Kalyan-TeluguStop.com

దీంతో అప్పటి నుంచి శ్రీ రెడ్డి కోలీవుడ్ లో ఉంటూ తన ఆక్రోశాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెళ్లగక్కుతోంది.

అయితే ఈ మధ్య కాలంలో నటి శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా టాలీవుడ్ మెగా హీరోలను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది.

 Telugu Actress Sri Reddy Negative Trolls On Allu Arjun And Pawan Kalyan-నిన్న అల్లు అర్జున్.. నేడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఆ మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా వైరస్ బారిన పడడంతో ఏకంగా తాను ఇలా అన్నానో లేదో అప్పుడే పుష్పానికి కరోనా వైరస్ సోకిందట అంటూ వ్యంగంగా కామెంట్లు చేసింది.దీంతో కొంతమేర స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు శ్రీ రెడ్డి ని సోషల్ మీడియాలో బాగానే ట్రోల్స్ చేశారు.

అయితే ఈ మధ్య శ్రీరెడ్డి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్స్ చేస్తోంది.ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ని ఇటు రాజకీయ పరంగా మరియు వ్యక్తిగత పరంగా కూడా శ్రీ రెడ్డి దారుణంగా విమర్శిస్తోంది.

దీనికితోడు కొందరు పవన్ కళ్యాణ్ నెగిటివ్ అభిమానులు కూడా సపోర్ట్ చేయడంతో మరింత రెచ్చిపోతుంది.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో పేరున్న నాయకుడు మరియు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఓ వ్యక్తిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు.

Telugu Negative Trolls On Allu Arjun, Pawan Kalyan, Pawan Kalyan Fans, Social Media, Sri Reddy, Sri Reddy Trolling Celebrities, Sri Reddy Trolls Pawan Kalyan, Telugu Actress, Telugu Actress Sri Reddy Negative Trolls On Allu Arjun And Pawan Kalyan, Tollywood-Movie

అయినప్పటికీ శ్రీ రెడ్డి మాత్రం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే వస్తోంది.కానీ ఇప్పటివరకు ఈ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించడం లేదు సరికదా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

అయితే ఈ విషయంలో ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో నటి శ్రీరెడ్డి ఆరోగ్య మరియు వంటలకి సంబంధించిన చిట్కాలను చెబుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది.అంతేకాకుండా శ్రీరెడ్డి హాట్ హాట్ అందాల ఆరబోతతో రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటోంది.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఫేస్ బుక్ ఖాతాను దాదాపుగా అరవై లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీ రెడ్డికి ఉన్నటువంటి ఫాన్ ఫాలోయింగ్ మరియు క్రేజీ గురించి.

#Pawan Kalyan #SriReddy #TeluguActress #Social Media #SriReddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు