ఆ హీరో తమ్ముడు నాతో సినిమా సెట్లో అలా ప్రవర్తించాడు....

పలు టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న యంగ్ నటి “సౌమ్య జాను” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తెలుగులో “తడాఖా, చందమామ కథలు, లయన్, పోవే పోరా, చౌరస్తా” తదితర చిత్రాలలో  కనిపించింది.

 Telugu Actress Sowmya Janu Sensational Comments On Telugu Producer Son Behaviour-TeluguStop.com

దీంతో ఇటీవలే చిన్న బడ్జెట్ తరహా చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఓ ప్రముఖ యూ ట్యూబ్  చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా మొదటగా బాలయ్య బాబు హీరోగా నటించిన లయన్ చిత్రంలో తానూ హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించానని చెప్పుకొచ్చింది.అయితే ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో కొంతమేర భయం వేసిందని, కానీ బాలయ్య బాబు నిజ స్వరూపం మరియు ఆయన తన తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం వంటి వాటి గురించి తెలియడంతో చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది.

అంతేకాక అందరూ బాలయ్య బాబు కి చాలా కోపం ఎక్కువని అనుకుంటారని కానీ అది చాలా తప్పని, అలాగే బాలయ్య బాబుకి క్రమశిక్షణన్నా, నిజాయితీ అన్నా ఎంతో ప్రాణమని ఎవరైనా తనతో నిజాయితీగా లేకపోయినా అలాగే  క్రమశిక్షణతో మెలగక పోయినా బాలయ్య బాబు రియాక్షన్ వేరేలా ఉంటుందని తెలిపింది.

ఇక తాను తెలుగులో “తడాఖా” చిత్రంలో నటిస్తున్న సమయంలో ఓ సారి ఓ ప్రముఖ సిని నిర్మాత కొడుకు అభి రామ్ సినిమా షూటింగ్ సెట్స్ కి వచ్చాడని, ఈ సమయంలో అతడికి తాను కేవలం హాయ్ చెప్పి తన కారావ్యన్ లోకి వెళ్లిపోయానని తెలిపింది.

ఆ తర్వాత ఏమైందో ఏమో గాని అభి రామ్ తన కారుని సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి దూరంగా పార్క్ చేయాలంటూ తన డ్రైవర్ తో చెప్పాడని, ఆ తర్వాత తన డ్రైవర్ మళ్లీ తన కారుని యథా స్థానంలో పార్క్ చేసినప్పటికీ మళ్లీ అభి రామ్ అతడిని పిలిచి వార్నింగ్ ఇచ్చాడట.దీంతో సౌమ్య జాను ఈ విషయం గురించి నాగ చైతన్యకు తెలియజేయడంతో వెంటనే అభి రామ్ ని పిలిచి మరోమారు ఇలా చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది.

ఆ తరువాత అభి రామ్ తన జోలికి రాలేదని తెలిపింది.ఆ సంఘటన ఇప్పటికీ తనకి చాలా బాగా గుర్తుందనీ అంతేగాక ఆ సమయంలో అభి రామ్ తనతో ఎందుకు అలా ప్రవర్తించాడో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube