వచ్చిన కొత్తలో అలాంటి సమస్యలు ఎదుర్కున్నా.. కానీ...  

Telugu actress Simran Choudhary Facing telugu language Struggles, Simran Choudhary, Telugu heroine, Simran Choudhary Facing Struggles in Film Industry, Tollywood - Telugu Simran Choudhary, Simran Choudhary Facing Struggles In Film Industry, Telugu Actress Simran Choudhary Facing Telugu Language Struggles, Telugu Heroine, Tollywood

తెలుగులో నూతన దర్శకుడు రామ్ భీమన దర్శకత్వం వహించిన “హమ్ తుమ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైన యంగ్ బ్యూటీ “సిమ్రాన్ చౌదరి” గురించి సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ఫర్వాలేదనిపించినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రాకపోవడంతో గుర్తింపుకు నోచుకోక లేకపోయింది తాజాగా సిమ్రాన్ చౌదరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గురించి స్పందించింది.

TeluguStop.com - Telugu Actress Simran Choudhary Facing Telugu Language Struggles

ఇందులో భాగంగా తాను హైదరాబాదులోనే పుట్టినప్పటికీ పెరిగింది మాత్రం ముంబయిలో  అని దాంతో తనకు తెలుగు భాష మాట్లాడడం స్పష్టంగా రాదని తెలిపింది. అలాగే తన ఇంట్లో వాళ్లు ఎక్కువగా హిందీ లేదా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారని అందువల్ల తనకు తెలుగులో స్పష్టంగా మాట్లాడటం, చదవడం రాదని చెప్పుకొచ్చింది.

 ఈ కారణంగా తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నానని అంతేగాక డైలాగులు చెప్పే విషయంలో కూడా ఇబ్బంది పడ్డానని తెలిపింది.

TeluguStop.com - వచ్చిన కొత్తలో అలాంటి సమస్యలు ఎదుర్కున్నా.. కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి స్పందిస్తూ తాను ఇప్పటివరకు సినిమా పరిశ్రమలో చాలా మంచి పేరున్న దర్శక నిర్మాతలతో పని చేశానని కాబట్టి ఎలాంటి లైంగిక వేధింపులకు గురి కాలేదని తెలిపింది.

ఒకవేళ భవిష్యత్తులో తాను క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కోవలసి వస్తే మాత్రం చాకచక్యంగా తప్పించుకుంటానని అంతే తప్ప సినిమా అవకాశాల కోసం ఎలాంటి తప్పుటడుగులు వేయనని స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సిమ్రాన్ చౌదరి తెలుగులో ఇటీవలే “భోంభాట్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

 ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.దీంతో ప్రస్తుతం సిమ్రాన్ చౌదరి తెలుగులో యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే నూతన దర్శకుడు  “జ్ఞాన సాగర్ ద్వారక” దర్శకత్వం వహిస్తున్న “సెహరీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

#SimranChoudhary #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు