సంపూర్ణేష్ బాబుని చూసి హీరో అంటే అవాక్కయ్యా.. కానీ...

ఒకప్పుడు తన చిత్రాలతో స్టార్ హీరోల చిత్రాలకు సైతం పోటీ ఇచ్చిన ప్రముఖ సీనియర్ నటి షకీలా గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి షకీలా మొదటగా సినిమా పరిశ్రమకు హీరోయిన్ అవ్వాలని వచ్చినప్పటికీ పలు ఆర్థిక సమస్యల కారణంగా బి గ్రేడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

 Telugu Actress Shakeela Sharing Shooting Experience About Kobbari Matta Movie-TeluguStop.com

దీంతో చివరికి షకీలా అలాంటి ఆఫర్లు రావడంతో బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలలో నటిస్తూ కంటిన్యు అయ్యింది.కానీ ప్రస్తుతం అలాంటి చిత్రాలలో నటించకుండా తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశాలు మాత్రమే అంగీకరిస్తోంది.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి షకీలా పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

 Telugu Actress Shakeela Sharing Shooting Experience About Kobbari Matta Movie-సంపూర్ణేష్ బాబుని చూసి హీరో అంటే అవాక్కయ్యా.. కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా తాను చిత్రాల్లో నటించడానికి రోజుల ప్రకారం పారితోషకం తీసుకుంటానని తెలిపింది.

 దీంతో కొందరు దర్శక నిర్మాతలు తనతో ఎక్కువ సన్నివేశాలని చిత్రీకరించి తమ తదుపరి చిత్రాలలో కూడా ఆ సన్నివేశాలను ఉపయోగించేవారని,  కానీ తను పెద్దగా పట్టించుకునే దానిని కాదని తెలిపింది.  తాను  ఆ మధ్య కొబ్బరి మట్ట చిత్రంలో నటించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే షూటింగ్ కి వెళ్ళినప్పుడు సంపూర్ణేష్ బాబు ని చూపించి ఇతడే హీరో అని చెప్పారట.దీంతో మొదట్లో ఇతడు హీరో ఏంటి అనుకున్నానని కానీ ఆ తర్వాత హృదయ కాలేయం చిత్ర సన్నివేశాలను చూసి సంపూర్ణేష్ గురించి తెలుసుకున్నానని తెలిపింది.

అంతేకాక సంపూర్ణేష్ బాబు చాలా వినయంగా మరియు గౌరవ మర్యాదలతో ఇతరుల పట్ల ప్రవర్తిస్తాడని ఆ విషయం తనకు బాగా నచ్చిందని తెలిపింది.

అలాగే ఈ చిత్రంలో తనతో పాటు నటించిన కత్తి మహేష్ గురించి కూడా తనకి మొదట్లో అసలు తెలియదని కానీ ఆ తర్వాత ఇతరుల ద్వారా కత్తి మహేష్ గురించి తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.

అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన రాజేష్ రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా తాను సినిమా మొదట్లో ఎంతయితే ఇస్తామని చెప్పారో అంతా పూర్తిగా ఇచ్చేశారని అందుకు ధన్యవాదాలు తెలిపింది.కాగా ఒకప్పుడు రోజుకి లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్న షకీలా ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

#TeluguActress #Shakeela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు