ఒకప్పటి ఈ హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ లో నటించింది... ప్రస్తుతం అవకాశాల్లేక...

Telugu Actress Ruthika Movie Offers And Special Songs News

ఒక్కోసారి కొంతమంది హీరో హీరోయిన్లు అవకాశాలు లేని ఈ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే వారి సినిమా జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేస్తాయి.ఇందులో భాగంగా కొందరు నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితం అవుతుంటే మరికొంత మంది హీరోయిన్లు అవకాశాలు లేక ఏకంగా స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు.

 Telugu Actress Ruthika Movie Offers And Special Songs News-TeluguStop.com

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన సిక్స్ టీన్స్  అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ప్రముఖ హీరోయిన్ రుతిక కూడా ఈ కోవకే చెందుతుంది.

అయితే హీరోయిన్ రుతిక సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.ఈ క్రమంలో ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ దాదాపుగా నాలుగు సంవత్సరాలలోనే హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Telugu Actress Ruthika Movie Offers And Special Songs News-ఒకప్పటి ఈ హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ లో నటించింది… ప్రస్తుతం అవకాశాల్లేక…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ నటి రుతిక నటించిన పాత్రలు మరియు చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఈ అమ్మడి సినిమా దాదాపుగా ముగిసి పోయింది.దీంతో ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక రుతిక పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించడానికి సిద్ధమైంది.

కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు.దీంతో ప్రస్తుతం రుతిక సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.

ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు చిత్రంలో కూడా రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.కానీ ఈ చిత్రం హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం పెద్దగా అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు.

కాగా తెలుగులో రుతిక నటించిన సారీ మా ఆయన ఇంట్లో నే ఉన్నాడు, సారీ నాకు పెళ్లైంది,.సరదా సరదాగా,  పెళ్ళికి నేను రెడీ, బ్లేడ్ బాబ్జి , ఎక్స్ట్రా, తదితర చిత్రాల్లో ప్రేక్షకులని బాగానే అలరించాయి.

కానీ చిత్రాలలో ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, కొన్ని సినిమాలు ప్లాఫ్ అవ్వడం వంటి కారణంగా హీరోయిన్ గా ఎవరూ గుర్తించలేదు.కాగా ప్రస్తుత రుతిక తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసం ఉన్నట్లు సమాచారం.

#TeluguActress #Ruthika #TeluguActress #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube