ఆ నటి తనని తన అసిస్టెంట్ ముందే బట్టలు మార్చుకోవాలందట.. దాంతో…

తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రినాధ్ కౌసూరి దర్శకత్వం వహించిన "నాకైతే నచ్చింది" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి నటిగా పరిచయం అయినటువంటి నటి రిషిక గురించి తెలియని వారుండరు.

అయితే వచ్చీరావడంతోనే హీరోయిన్ గానే  సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ అమ్మడు నటించిన  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

దీంతో ప్రస్తుతం అడపాదడపా సిరివెళ్ల లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే తాజాగా నటి రిషిక ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ క్రమంలో తాను అప్పట్లో ఓ సీరియల్ లో నటిస్తున్న సమయంలో దర్శక నిర్మాతలు గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని రమ్మని చెప్పడంతో తన గదిలోకి వెళ్లానని కానీ అప్పటికే ఓ సీనియర్ నటి ఆ గదిలో మేకప్ వేసుకుని ఉండగా తాను బట్టలు మార్చుకోవడానికి అనుమతి కోరడంతో ఆమె నిరాకరించిందట.

అంతేగాక ఒకవేళ తాను బట్టలు మార్చుకోవాలంటే తన అసిస్టెంట్ కూడా అక్కడే ఉంటాడని చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నానని చెప్పుకొచ్చింది.

ఆ తరువాత తేరుకొని వెంటనే ఆ విషయమై సీనియర్ నటి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది.

ఈ సమాజంలో ఆడదానికి ఆడదే శత్రువు అంటూ వాపోయింది.అలాగే సినీ పరిశ్రమలో మనం వేసుకునే బట్టలను బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారని అది చాలా తప్పని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా రిషిక తెలుగులో మూడు చిత్రాలలో నటించింది.

అయితే ఇందులో ఒక చిత్రం ఇప్పటికీ  విడుదల కాలేదు.అలాగే అమ్మ నా కోడలా అనే ధారావాహికలో కూడా నటించింది.

ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కరిస్తా : విజయసాయిరెడ్డి