ఈమె ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా…  

Telugu Actress Rakshita Latest Photos News - Telugu Photo Talk, Rakshita, Telugu Actress, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి ఇడియట్ చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బెంగళూరు బ్యూటీ రక్షిత గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారు ఉండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో అప్పట్లో మహేష్ బాబు,  రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల  చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.

 Telugu Actress Rakshita Latest Photos News

ఈ క్రమంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన  ప్రముఖ దర్శకుడు ప్రేమ్ ని 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి చేసుకున్నా కూడా అడపాదడపా పాత్రలో నటిస్తూ కొంతకాలం పాటు రక్షిత ప్రేక్షకులని బాగానే అలరించింది.

ఆ తర్వాత ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి కూడా వచ్చి భారత జనతా పార్టీ లో చేరింది.అయితే తెలుగులో రక్షిత నటించినటువంటి ఇడియట్, నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు, జగపతి, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించడమే కాకుండా రక్షితకి కూడా మంచి గుర్తింపు తెచ్చాయి.

ఈమె ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత నటి రక్షిత ఆ మధ్యకాలంలో దేవుడిని దర్శించుకునేందుకు ఆలయానికి రాగా కొందరు ఆమె ఫోటోలను క్లిక్ మనిపించి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మధ్య నటి రక్షిత బాగా బరువు పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఏమైందో ఏమో గాని ఈ మధ్యకాలంలో నటి రక్షిత తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి అసలు ఆలోచించడం లేదు.దీన్ని బట్టి చూస్తే నటి రక్షిత ఇక తెలుగు సినిమాల్లో కి వచ్చే ఉద్దేశం లేనట్లు తెలుస్తోంది.

అయితే నటి రక్షిత సినిమాల పరంగా అవకాశాలు వస్తున్నప్పటికీ నో చెబుతున్న ఈ అమ్మడు కన్నడ భాషకు చెందిన పలు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ప్రసారమేయ్యే  పలురకాల షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actress Rakshita Latest Photos News Related Telugu News,Photos/Pics,Images..

footer-test