సీరియల్ ఇండస్ట్రీలో కూడా అది కావాలని అడుగుతారు

తెలుగులో పలు చిత్రాలలో మరియు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను, అటు వెండితెర ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ నటి రాజశ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి రాజశ్రీ రెడ్డి మొదటగా దూరదర్శన్ ఛానల్ లో కొంతకాలం పాటు పలు సీరియళ్ళకి రైటర్ గా పని చేశారు.

 Telugu Actress Rajasri Reddy Sensational Comments On Casting Couch In Serial Industry-TeluguStop.com

ఆ తరువాత క్రమక్రమంగా తన లో ఉన్నటువంటి నటనా ప్రతిభను నిరూపించుకుని కొన్ని వందల ధారావాహికలలోకూడా నటించింది.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి రాజశ్రీ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ సమస్య అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదని సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఉంటుందని స్పష్టం చేసింది.అంతేకాకుండా కాస్టింగ్ కౌచ్ కి సీరియల్ ఇండస్ట్రీ లేదా సినిమా ఇండస్ట్రీ అనే బేధం లేదా తారతమ్యం ఉండదని మనుషులలో ఉన్నటువంటి చెడు ఎక్కడున్నా అలాగే ఉంటుందని అలాంటి మనుషుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 Telugu Actress Rajasri Reddy Sensational Comments On Casting Couch In Serial Industry-సీరియల్ ఇండస్ట్రీలో కూడా అది కావాలని అడుగుతారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లోనే అవకాశాల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కకూడదని నిర్ణయించుకున్నానని అందువల్లనే స్టార్ హీరోయిన్ కాలేకపోయానని కూడా చెప్పుకొచ్చింది.అలాగే సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ని అరికట్టాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించాలని అప్పుడే మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయగలమని చెప్పుకొచ్చింది.

కాగా ఇప్పటి వరకూ తాను నటించిన ధారావాహికలలో ఎక్కువ శాతం పాత్రలో చాలా బాగా ఉద్యోగాలతో కూడుకుని ఉంటాయని, అందువల్లనే తన పాత్రకి న్యాయం చేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందని కూడా తెలిపింది.అయితే ఆ మధ్య తాను ఆడదే ఆధారం అనే ధారావాహికలోని ఓ సన్నివేశంలోనటిస్తున్న సమయంలో అనుకోకుండా పాత్రలో ఇమిడిపోయి నటించానని ఈ క్రమంలో అనుకోకుండా ఊపిరి పీల్చడం కూడా కష్టంగా మారిందని అంతగా పాత్రలో ఇమిడి పోతానని తెలిపింది.

అయితే తనకు సినిమాలలో నటించడానికి ఇచ్చేటువంటి పారితోషికం కంటే తన పాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత ముఖ్యమని అందువల్లనే ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ పాత్రలను ఎంచుకుంటానని తెలిపింది.

#Serial Industry #TeluguActress #Rajasri Reddy #TeluguVeteran #Casting Couch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు