పెళ్ళైన రెండేళ్లకే తన భర్త చనిపోవడంతో ఈ హీరోయిన్ ....

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు  సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన “భద్రాద్రి రాముడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన “మంగుళూరు బ్యూటీ రాధికా కుమారస్వామి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రాధికా కుమారస్వామి తెలుగులో నటించింది కొన్ని చిత్రాలలోనే అయినప్పటికీ సినీ ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుంటుంది.

 Telugu Actress Radhika Kumaraswamy First Husband Death News, Radhika Kumaraswamy-TeluguStop.com

 ఈమె ముఖ్యంగా కన్నడ అనువాద చిత్రాలలో ఎక్కువగా నటించింది.అయితే సినిమా పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా కుమారస్వామి నిజ జీవితంలో మాత్రం చాలా విషాదాలను ఎదుర్కొంది.

ఇందులో ముఖ్యంగా 2000వ సంవత్సరంలో ఎన్నో ఆశలతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త రతన్ కుమార్ అనుకోకుండా 2002వ సంవత్సరంలో మృతి చెందాడు.దీంతో రాధిక కుమారస్వామి తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఆ తర్వాత కుటుంబ సభ్యులు అండదండలతో తేరుకుని మళ్ళీ తన సినీ జీవితం పై దృష్టి సారించింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ని 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.

దీంతో ప్రస్తుతం రాధికా  తన భర్త కుమారస్వామికి ఇటు రాజకీయాల్లో సహాయం చేస్తూ అటు కుటుంబ బాధ్యతలను కూడాచక్కబెడుతుంది. పెళ్లయిన తర్వాత కూడా రాధికా కుమారస్వామి అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అంతేగాక అప్పుడప్పుడు పలు చిత్రాలకు నిర్మాత, సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.కాగా తెలుగులో రాధికా కుమారస్వామి నటించిన “భద్రాద్రి రాముడు మరియు అవతారం” చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాధికా కుమారస్వామి కన్నడ భాషలో “కాంట్రాక్ట్” అనే చిత్రంలో ప్రాధాన్యత  ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అంతేగాక ఇటీవలే కన్నడ ప్రముఖ సినీ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న అటువంటి “బైర దేవి” అనే ఫాంటసీ చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 అయితే ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి మెయిన్ లీడ్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube