నగ్నంగా దిగిన ఫోటోలను పంపమని హీరోయిన్ ని అడిగిన నెటిజన్.... దాంతో హీరోయిన్ ఏకంగా...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు సామాన్య ప్రజలకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది.అంతేగాక సినిమా సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది నెటిజన్లు మరియు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందుబాటులో ఉంటున్నారు.

 Telugu Actress Punarnavi Bhoopalam Facing Abusive Comments From Unknown Netizen-TeluguStop.com

కానీ ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అడగడంతో పాటు మరియు కొంతమేర అసభ్యకరమైన ప్రశ్నలను అడుగుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కాగా తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పునర్ణవి భూపాళం ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అసహనానికి గురయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే పునర్ణవి భూపాళం అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలను యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

 అయితే ఇందులో ఓ నెటిజన్ ఏకంగా తన నగ్న ఫోటోలను పంపించాలని పునర్ణవి భూపాళం ని అడిగాడు. దీంతో పునర్ణవి భూపాళం తనదైన శైలిలో స్పందిస్తూ తన మధ్య వేలుని చూపిస్తూ సమాధానం ఇచ్చింది.

 అంతేగాక ఈ విషయాన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో షేర్ చేసింది.దీంతో పునర్ణవి భూపాళం చేసినటువంటి ఈ పనికి కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు. అంతేకాక ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు సెలబ్రిటీల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పనులు చేస్తున్నారని ఇలాంటి వారికిపునర్ణవి భూపాళంసరైన సమాధానం ఇచ్చి బుద్ధి చెప్పిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య పునర్ణవి భూపాళం తన చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది.

ఆ మధ్య “ఒక చిన్న విరామం” అనే చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద కనిపించిన ఈ అమ్మడు మళ్లీ ఇప్పటివరకు తన కొత్త సినిమా అప్డేట్ గురించి ఎలాంటి సమాచారాన్ని అభిమానులకి ఇవ్వలేదు. కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “సైకిల్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రంలో “బ్యాక్ బెంచ్ స్టూడెంట్” చిత్ర ఫేమ్ మహత్ రాఘవేంద్ర హీరోగా నటిస్తుండగా శ్వేతా వర్మ, సుదర్శన్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube