తెలుగులో ఈటీవీలో నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే అయితే ఈ చిత్రంలో బాలయ్య బాబుకు జోడిగా కంచె మూవీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గా నటించగా పూర్ణ, సీనియర్ హీరో శ్రీకాంత్, జగపతి బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు దర్శకనిర్మాతలు కలెక్షన్ల వర్షం కురపిస్తుంది.
కాగా తాజాగా ఈ చిత్రం లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన పూర్ణ ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్రం గురించి మరియు తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా అఖండ చిత్రం కోసం పనిచేసిన చిత్ర యూనిట్ సభ్యులు అందరూ చాలా కష్ట పడ్డారని అందుకు తగ్గ ఫలితం వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది.
ఇక సినిమా సెట్ లో నందమూరి బాలకృష్ణ అందరితోనూ బాగా కలిసిపోతూ సందడి సందడి గా ఉంటారని అందువల్లనే సినిమా షూటింగ్ సెట్లో ఉన్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి వచ్చింది.ఇక ఆ మధ్య తన హీరోయిన్ గా నటించినప్పటికీ సినీ కెరీర్ పరంగా పెద్దగా రాణించలేక పోయానని దాంతో తన పాత్రలు మరియు నటన పరంగా ఇతర విషయాల గురించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో ఈ సినిమాలో తన పాత్ర నిడివి గురించి కాకుండా తన పాత్రకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు వస్తే ఖచ్చితంగా కాదనకుండా నటిస్తానని తెలిపింది.ఈ క్రమంలో రెమ్యునరేషన్ గురించి కూడా తనకు పెద్దగా పట్టింపు ఉండదని చెప్పుకొచ్చింది.
అలాగే లాక్ డౌన్ తర్వాత తనకి సినిమా ఆఫర్లు బాగా వస్తున్నాయని దాంతో గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన 3 రోజెస్ (వెబ్ సీరీస్), అఖండ తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే అలరించాయి.దీంతో ప్రస్తుతం పూర్ణ కి సినిమా అవకాశాలు కూడా బాగానే తలపడుతున్నాయి కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో దాదాపుగా నాలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది.దీంతో అప్పటివరకు హీరోయిన్గా నటించినా నటి పూర్ణ కి పెద్దగా గుర్తింపు లభించలేదని కానీ ఈ మధ్యకాలంలో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.