ఆ నటుడే పూర్ణ కి డ్రగ్స్ ఎలా తీసుకోవాలో నేర్పించాడట....

తెలుగులో ఇటీవలే నూతన దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన “పవర్ ప్లే” చిత్రం విడుదలయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా రాజ్ తరుణ్ నటించగా మరో హీరో ప్రిన్స్, అజయ్, హీరోయిన్ పూర్ణ, సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Telugu Actress Poorna About Drug Consumption Scene Acting-TeluguStop.com

 అయితే ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నటి పూర్ణ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన పలు విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా థ్రిల్లర్ జోనల్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆశా భావం వ్యక్తం చేసింది.

 Telugu Actress Poorna About Drug Consumption Scene Acting-ఆ నటుడే పూర్ణ కి డ్రగ్స్ ఎలా తీసుకోవాలో నేర్పించాడట….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అంతేగాక ఈ చిత్రంలో తాను డ్రగ్స్ అలవాటు ఉన్న మహిళ పాత్రలో నటించడానికి చాలా కష్టపడ్డానని తెలిపింది. అంతేకాక తనకి డ్రగ్స్ ఎలా ఉపయోగించాలో అసలు తెలియదని దాంతో తనతో పాటు ఈ సినిమాలో నటించిన ఓ నటుడు వాటిని ఎలా ఉపయోగించాలో తెలిపాడని అలా డ్రగ్స్ ఉపయోగించే సన్నివేశాలలో నటించానని తెలిపింది.

అయితే తన కెరియర్ లోనే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించడం ఇదే మొదటిసారని కాబట్టి హావభావాల విషయంలో కొంతమేర ఎక్కువ సమయం తీసుకున్నానని కూడా చెప్పుకొచ్చింది.అంతేకాకుండా ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ కి వెళ్ళి ఈ సినిమా చూడాలని కోరింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూర్ణ తెలుగులో “సుందరి” అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కళ్యాణ్.

జి  దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే “బ్యాక్ డోర్” అనే చిత్రంలో కూడా పూర్ణ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.దీంతో తమిళంలో దివంగత ముఖ్యమంత్రి మరియు నటి జయలలిత జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న “తలైవి” అనే చిత్రంలో నటిస్తోంది.

#PowerPlay #PoornaAbout #Poorna #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు