రాజకీయాలు చదువుతున్న తెలుగు హీరోయిన్.. అందుకేనా..?

కొంతమంది నటీనటులకు అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ అనుకోకుండా పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమకి దూరమై గుర్తింపు తెచ్చుకోలేకపోయిన నటీనటులు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.అయితే ఇందులో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన “మాయాజాలం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ హీరోయిన్ “పూనమ్ కౌర్” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Telugu Actress Poonam Kaur Studying Political And Policy Making-TeluguStop.com

అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.కానీ క్రమక్రమంగా తన చిత్ర కథల విషయంలో మరియు తన పాత్రల విషయంలో అవగాహన లోపించడంతో హీరోయిన్ గా రాణించలేక పోయింది.

దీనికి తోడు అప్పటివరకు హీరోయిన్ గా నటించిన పూనమ్ కౌర్ చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ మరియు కామియో అప్పియరెన్స్ వంటి పాత్రలలో నటించడంతో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

 Telugu Actress Poonam Kaur Studying Political And Policy Making-రాజకీయాలు చదువుతున్న తెలుగు హీరోయిన్.. అందుకేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో నటి పూనమ్ కౌర్ అడపాదడపా చిత్రాలలో నటిస్తున్నప్పటికీ ఈ చిత్రాలు కూడా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రావడం లేదు.

కాగా తాజాగా నటి పూనమ్ కౌర్ మళ్ళీ చదువుపై దృష్టి సారించినట్లు సమాచారం.అయితే తాజాగా నటి పూనమ్ కౌర్ తన అదికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేసింది.

అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్ ప్రస్తుతం మీరు ఏమి చదువుతున్నారంటూ కామెంట్ చేశాడు.దీంతో పూనమ్ కౌర్ ఈ విషయంపై స్పందిస్తూ తాను ప్రస్తుతం “రాజకీయాలు మరియు పాలసీ మేకింగ్” సంబంధిత సబ్జెక్టులను చదువుతున్నట్లు తెలిపింది.

అలాగే సయ్యద్ అక్బరుద్దీన్ తో దిగిన ఫోటో ని కూడా షేర్ చేసింది.

భవిష్యత్తులో అక్బరుద్దీన్ ని “ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్” గా చూడాలని ఉందని కూడా పెట్టింది.దీంతో ప్రస్తుతం పూనమ్ కౌర్ రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.అంతే కాకుండా ఈ మధ్యకాలంలో పూనమ్ కౌర్ కి రాజకీయాలపై ఆసక్తి బాగా పెరిగిందని అందువల్లనే సమాజంలో జరిగేటువంటి విషయాలపై కూడా స్పందిస్తోందంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా భవిష్యత్తులో పూనమ్ కౌర్ జాతీయ లేదా రాష్ట్రీయ రాజకీయాలలో చక్రం తిప్పే అవకాశం కూడా ఉందని మరికొందరు అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూనమ్ కౌర్ తమిళ భాషలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “గెస్ట్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Poonam Kaur #Policy #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు