అప్పట్లో అలా చేయడం వల్లే ఇప్పుడిన్ని కష్టాలంటున్న హీరోయిన్... 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా రోజుకి దాదాపు మూడు లక్షలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

 Telugu Actress Poonam Kaur React About Oxygen Shortage In India-TeluguStop.com

దీంతో దేశంలోని పలు చోట్ల ఆక్సిజన్ వాయువు అందక చాలామంది కరోనా వైరస్ సోకిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు.దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హుటాహుటిన ఆక్సిజన్ వాయివుని అందించే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా చోట్ల కనీస వైద్య సదుపాయాలు అందక ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.

అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించింది.

 Telugu Actress Poonam Kaur React About Oxygen Shortage In India-అప్పట్లో అలా చేయడం వల్లే ఇప్పుడిన్ని కష్టాలంటున్న హీరోయిన్… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా గతంలో ఆక్సిజన్ వాయువుని ఇచ్చేటువంటి చెట్లని నరికి వేయడం వల్లనే ప్రస్తుతం ఆక్సిజన్ వాయువుకి కొరత ఏర్పడిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించిన ఓ ఫోటో ని కూడా జోడించింది.దీంతో పూనమ్ కౌర్ చెప్పింది అక్షర సత్యమని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఎప్పుడైతే నీళ్లని శుద్ధి చేసి తాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడే గాలిని కూడా కొనుక్కోవలసిన అవసరం వస్తుందనే విషయాన్ని మానవ ప్రపంచం గుర్తించాల్సిందని కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూచిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలే లేవు.దీంతో కోలీవుడ్ సినిమా పరిశ్రమపై దృష్టి సారించింది.ఇందులో భాగంగా ప్రస్తుతం పూనమ్ కౌర్ తమిళ భాషలో రెండు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అయితే ఇందులో కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “గెస్ట్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చెన్నైలో జరుగుతుండగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు సమాచారం.

#OxygenShortage #TeluguActress #Poonam Kaur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు