పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం దక్కించుకున్న యంగ్ హీరోయిన్..

తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రాజకీయాల కారణంగా మూడు సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ తన రీ – ఎంట్రీ తో అదరగొట్టేందుకు సిద్దమవుతున్నాడు.

 Telugu Actress Poojitha Ponnada Special Song Offer On Pawan Kalyan Movie-TeluguStop.com

 ఈ క్రమంలో ఇప్పటికే శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ చిత్రానికి కేవలం 25 రోజులు మాత్రమే కేటాయిస్తానని చెప్పాడట.

దీంతో చిత్ర యూనిట్ సభ్యులు బిజీ బిజీ షెడ్యూల్ తో ఈ చిత్ర షూటింగ్ పనులను ముగించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు.

 Telugu Actress Poojitha Ponnada Special Song Offer On Pawan Kalyan Movie-పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం దక్కించుకున్న యంగ్ హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన తెలుగు యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ నటిస్తోంది.ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రానికి “హరహర వీరమల్లు” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ చిత్రం టైటిల్ పై ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పూజిత పొన్నాడ ఆ మధ్య మహానటి చిత్ర ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మిస్ ఇండియా అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగాఆకట్టుకోకపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు.

 దీంతో కనీసం పవన్ కళ్యాణ్ చిత్రంతోనైనా హిట్ కొట్టి సినిమా హీరోయిన్ అవకాశాలను దక్కించుకోవాలని గంపెడాశలతో ఉంది.మరి ఈ అమ్మడి ఆశలు నెరవేరుతాయా లేదో చూడాలి.

#PoojithaPonnada #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు