తమిళ బిగ్ బాస్ లో తెలుగమ్మాయి.. ఏమేరకు రాణిస్తుందో చూడాలి

తెలుగు బిగ్ బాస్ మాదిరిగానే తమిళ బిగ్ బాస్ కూడా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదవ సీజన్ లోకి అడుగు పెట్టింది.ప్రస్తుతం ఇక్కడి లాగే అక్కడ కూడా ఐదో సీజన్ జనాలను అలరిస్తుంది.

 Telugu  Actress Pavani Entry Into Tamil High Boss Details, Pavani, Tamil Bigg Bo-TeluguStop.com

తెలుగు బిగ్ బాస్ నాలుగు వారాలు పూర్తి చేసుకున్న సమయంలో అక్కడి బిగ్ బాస్ మొదలయ్యింది.తాజాగా ఫస్ట్ డే ఎపిసోడ్ కలర్ ఫుల్ గా మొదలయ్యింది.

కమల్ హాసన్ హోస్టుగా షో మొదలయ్యింది.మొత్తంగా 18 మంది కంటెస్టెంట్లు హైస్ లోకి వెళ్లారు.

అందులో ఓ తెలుగు అమ్మాయి కూడా ఉంది.ఇంతకీ తను ఎవరో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పావని రెడ్డి నిజానికి తెలుగు జనాలకు పరిచయమే.పలు తెలుగు సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది.అయితే అనుకున్నంత స్థాయిలో పేరు రాలేదు.అదే సమయంలో తన భర్త ఆత్మహ్య చేసుకున్నాడు.

దీంతో తనను నెగెటివ్ గా చూపించే ప్రయత్నం చేసింది ఇక్కడి మీడియా, ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు.దీంతో తనకు ఇక్కడ ఉండటం నచ్చలేదు.

అందుకే చెన్నై వెళ్లింది.అక్కడ అకాశాలు పొందింది.

పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసింది.మంచి పేరు తెచ్చుకుంది.

నిజానికి పావని తెలుగు అమ్మాయి అయినా చక్కగా తమిళం మాట్లాడుతోంది.దాంతో పాటు అక్కడి జనాలకు కూడా బాగా తెలిసిన వ్యక్తి.

అందుకే తనను బిగ్ బాస్ షోకు ఎంపిక చేశారు నిర్వాహకులు.

Telugu Kamal Hasan, Pavani, Pavanitamil, Season, Tamil Bigg Boss, Tamilbigg, Tel

అయితే తమిళ జనాలకు ప్రాంతాయ తత్వం పట్ల బాగా అభిమానం ఎక్కువ.అందుకే మిగతా కంటెస్టెంట్లతో పోల్చితే పావనికి ఏమేరకు సపోర్టు దొరుకుతుంది? అనేది ప్రస్తుతం ప్రశార్థకంగా మారింది.హౌస్ లోనూ తనను ముందుకు కొనసాగకుండా ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమో అనే అనుమానం కలుగుతుంది.

అయితే.ఆమెను సీరియల్స్, సినిమాల్లో ఆదరించినట్లుగానే.

బిగ్ బాస్ లోనూ మంచి ఆదరణే దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఏది నిజం అవుతుందో తెలియాలి అంటే.

మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube