ఆస్తుల కోసం మా అమ్మనాన్నలకి విషం ఇచ్చి హత్య చేసారు...

తెలుగు చిత్రాలలో హీరో తల్లి, వదిన, అక్క, చెల్లి, తదితర పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “పద్మ జయంతి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి పద్మ జయంతి కేవలం చిత్రాలలో మాత్రమే కాకుండా పలు ధారావాహికలలో కూడా నటించింది.

 Telugu Actress Padma Jayanthi About Her Parents Death-TeluguStop.com

దీంతో ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి పద్మ జయంతి పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న పలు సంఘటనలు గురించి మరియు విషాదాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తనకి 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆ సమయంలో కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లిని అంగీకరించకపోవడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చింది.అయితే చిన్నప్పుడు తమకి ఆస్తిపాస్తులు బాగానే ఉండేవని దాంతో తన తల్లిదండ్రుల అన్నదమ్ములు ఆస్తుల కోసం తన తల్లిదండ్రులను విషం ఇచ్చి దారుణంగా హత్య చేశారని పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

 Telugu Actress Padma Jayanthi About Her Parents Death-ఆస్తుల కోసం మా అమ్మనాన్నలకి విషం ఇచ్చి హత్య చేసారు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో తన అన్న తమ తల్లిదండ్రులకు జరిగినట్లు తనకి కూడా జరుగుతుందని భయపడి ప్రస్తుతం ఎవరికీ తెలియకుండా గుట్టుగా జీవిస్తున్నాడని చెప్పుకొచ్చింది.అయితే ఈ మధ్య కాలంలో తన కంటపడితే ఎక్కడ సహాయం అడుగుతానో అని కనీసం కనిపించినప్పుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడడని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

అయితే తన కుటుంబ సభ్యులు, తోడబుట్టిన సోదరుడు, తనని వదిలేసినప్పటికీ తన భర్త మాత్రం చాలా అండగా నిలబడ్డాడని, ఒక రకంగా చెప్పాలంటే తన భర్త వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు కూడా తెలిపింది.అలాగే తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు తన భర్త తనని డిగ్రీ మరియు ఎం.

ఏ లిటరేచర్ వరకు చదివించాడని ఆ తర్వాత పలు చిత్రాలలో నటించే అవకాశాలు రావడంతో చదువుకు స్వస్తి పలికి నటన వైపు వచ్చానని తెలిపింది.

#PadmaJayanthi #TeluguActress #PadmaJayanthi #Padma Jayanthi #PadmaJayanthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు