తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “హాయ్” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ “నిఖిత తుక్రుల్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించడంతో తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో వరుసగా నటించే అవకాశాలు దక్కించుకుంద.
ఆ తర్వాత అప్పుడప్పుడు తెలుగులో కూడా కనిపించినప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో ఎక్కువ కాలం తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రాణించలేక పోయింది. కానీ ఒకప్పుడుకన్నడ సినీ పరిశ్రమలో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణించింది.
అయితే వరుస అవకాశాలతో కన్నడ సినీ పరిశ్రమలో దూసుకుపోతున్న సమయంలో ఓ ప్రముఖ కన్నడ సినీ నటుడుతో ఈ అమ్మడు ప్రేమాయణం నడిపిందని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. అంతేగాక ఆ ప్రముఖ సినీ నటుడు నిఖిత తుక్రుల్ కోసం అప్పట్లోనే ముంబైలో ఒక ఇల్లు కూడా కొనిచ్చాడని అలాగే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని కొందరు చర్చించుకుంటున్నారు.
చివరికి ఈ విషయంలో పెద్ద గొడవ జరగడంతో దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కన్నడ సినిమా పరిశ్రమ నిఖిత తుక్రుల్నిషేధించింది.
దీంతో నిఖిత తుక్రుల్ తీవ్ర మనస్థాపానికి గురై తన సినిమా కెరీర్ పై దృష్టి సారించ లేకపోయింది.
అనంతరం తన గతాన్ని మర్చిపోయి ముంబైకి చెందినటువంటి ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తని మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం ఈమెకి ఒక పాప కూడా ఉంది.
అయితే పెళ్లయిన తర్వాత నిఖిత తుక్రుల్ అడపాదడపా చిత్రాల్లో కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. దీంతో డీ గ్లామరస్ పాత్రలో అయినా సరే నటించేందుకు సిద్ధమని అంటోంది.
కాగా ప్రస్తుతం తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు ఇటీవలే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటోని షేర్ చేసి తెలియజేసింది.