అందుకే ఇప్పటి వరకూ పిల్లల్ని కనలేదంటూ ఎమోషనల్ అయిన సీరియల్  హీరోయిన్…  

Neeraja, telugu actress, Tollywood, real life news, Children\'s news - Telugu Children\\'s News, Neeraja, Real Life News, Telugu Actress, Tollywood

తెలుగులో పలు సీరియళ్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నటి నీరజ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈమె నటించిన ధారావాహికలకు బాగా కనెక్ట్ అయినటువంటి అభిమానులు ఆమెను ఇంట్లో మనిషిగా చూస్తుంటారు.

 Telugu Actress Neeraja Reveals About Her Children

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో నటి నీరజ పాల్గొంది.ఇందులో బాగంగా తన బుల్లితెర ప్రయాణం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో తాను అప్పట్లో దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యే “తులసీ దళం” అనే ధారావాహిక ద్వారా బుల్లితెర కు పరిచయం అయ్యానని తెలిపింది.అలాగే  ఇప్పటివరకూ తాను దాదాపుగా 40 ధారావాహికలలో నటించానని, మొదట్లో తాను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో కొత్త వ్యక్తులతో పెద్దగా మాట్లాడే దాన్ని కాదని, కానీ ఎవరితోనైనా పరిచయం ఏర్పడితే వారితో తొందరగా కలిసి పోతాయని చెప్పుకొచ్చింది.
  ఇక తన వ్యక్తి గత జీవితం విషయానికొస్తే తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న తన పెంపుడు కుక్క పిల్ల ఇటీవల మృతి చెందిందని, దాంతో ఈ విషయం తన మనసుని ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చింది.అలాగే ఆ కారణంగానే ఇప్పటివరకు తాము పిల్లల్ని వద్దనుకున్నామని ఇకముందు కూడా కుదిరితే పిల్లలను దత్తత తీసుకొని పెంచుకోవాలని యోచనలో ఉన్నట్లు తెలిపింది.

అందుకే ఇప్పటి వరకూ పిల్లల్ని కనలేదంటూ ఎమోషనల్ అయిన సీరియల్  హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నీరజ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే స్వాతి చినుకులు అనే ధారావాహికలో నటిస్తున్నట్లు తెలిపింది.అలాగే జీ తెలుగు, మా టీవీ, లలో ప్రసారమయ్యే మరో రెండు సీరియళ్లలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

అయితే ఇప్పటి వరకు తాను నటించిన టువంటి ధారావాహికలలో ఎక్కువశాతం ఈ టీవీ ఛానల్ కి సంబంధించిన ధారావాహికలలో నటించే నటించానని  అందువల్ల ఈ టీవీ ఛానల్ లో పని చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.

#Neeraja #Real Life News

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actress Neeraja Reveals About Her Children Related Telugu News,Photos/Pics,Images..