ఈ అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకుంది... చివరికి...

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “జ్యోతి లక్ష్మి” ఈ చిత్రంలో హీరో అక్క పాత్రలో నటించే ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “నీలియా భవాని” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి నీలియా భవాని ఇప్పటివరకు తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాలేదని చెప్పాలి.

 Telugu Actress Neelya Bhavani Marriage And Divorce News-TeluguStop.com

కానీ అమ్మ, అక్క, చెల్లి, తదితర పాత్రలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.అయితే నటి భవాని మాజీ భర్త కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాడనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

అయితే నటి నీలియా భవాని భర్త ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ చంద్ర శేఖర్… అయితే చంద్ర శేఖర్ అంటే సినీ ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు గానీ చత్రపతి శేఖర్ అంటే మాత్రం సినిమా పరిశ్రమలో టక్కున ఇట్టే గుర్తు పట్టేస్తారు.కాగా చత్రపతి శేఖర్ మరియు నీలా భవాని 18 ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

దీంతో అప్పట్లో వీరి పెళ్లి సమయంలో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు.అయినప్పటికీ పెద్దలను ఎదిరించి మరి గుడిలో వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన చత్రపతి శేఖర్ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించాడు.కానీ ఏమైందో ఏమో గాని పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్యలో విభేదాలు రావడంతో ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

దీంతో ప్రస్తుతం చత్రపతి శేఖర్ హైదరాబాదులో నివాసముంటున్నట్లు సమాచారం.

Telugu Chandrasekhar, Neelya Bhavani, Neelyabhavani, Telugu Actress, Teluguactre

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఛత్రపతి శేఖర్ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్ ఆర్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అలియా భట్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గన్, జగపతి బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube