ఈ హీరోయిన్ పెళ్లి కోసం ఏకంగా మతాన్ని కూడా మార్చుకుందట...

తెలుగులో లో శివ రామ రాజు అనే చిత్రంలో ముగ్గురు హీరోల ముద్దుల చెల్లెలి పాత్రలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తమిళ నటి మౌనిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలను దక్కించుకుంది.

 Telugu actress Monica Converted To Islam News,monica, Telugu Actress, Islam Rel-TeluguStop.com

 కానీ ఆమె మాతృభాష తమిళంలో ఎక్కువ సినిమా అవకాశాలు రావడంతో తెలుగు చిత్రాల పై పెద్దగా దృష్టి సారించలేకపోయింది.దీంతో తెలుగులో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

అయితే ఆ మధ్య కాలంలో కొంతమేర సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.ఇందులో భాగంగా మాలిక్ అనే పారిశ్రామిక వేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 అంతేగాక పెళ్ళికి ముందు ఈమె ఇస్లాం స్వీకరించి రహీమా అని పేరు కూడా మార్చుకుంది. దీంతో మౌనిక తన ప్రియుడితో పెళ్లి కోసమే మతాన్ని మార్చుకుందంటూ పలు ఆరోపణలు ఎదుర్కొంది.

దీంతో ఆ విషయంపై స్పందించిన మౌనిక తాను పెళ్లి కోసం తన మతాన్ని మార్చుకోలేదని తనకు ఇస్లాం మతం పై ఉన్నటువంటి ప్రేమ మరియు గౌరవం కారణంగానే తాను మతాన్ని మార్చుకున్నారని అలాగే భారతదేశంలో ప్రతీఒక్కరికి తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంటుందని తెలిపింది.

అయితే ఒకప్పుడు పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు సెంటిమెంటల్ చిత్రాలలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి మౌనిక పెళ్లయిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.

కాగా తెలుగు తమిళం, కన్నడ, మలయాళ తదితర భాషలలో కలిపి దాదాపుగా 30కి పైగా సినిమాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.అయితే చివరగా తమిళంలో 2016వ సంవత్సరంలో మీరా జకరతై అనే చిత్రంలో నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube