అందుకే ఈ హీరోయిన్ కి ఆఫర్లు ఇవ్వడం లేదంట .... దీంతో అవకాశాల్లేక...

తెలుగులో ప్రముఖ దర్శకుడు “ధరణి” దర్శకత్వం వహించిన “బంగారం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “బాలీవుడ్ బ్యూటీ మీరా చోప్రా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో బాగానే సినిమా అవకాశాలు దక్కించుకుంది.

 Telugu Actress Meera Chopra Movie Offers Gossip News, Meera Chopra, Telugu Actre-TeluguStop.com

  కానీ చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.మీరా చోప్రా సినిమా బ్యాక్గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు అనివార్య కారణాల వల్ల స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.

దీంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ కాకపోవడానికి ముఖ్య కారణంగా ఈమె “ప్రవర్తన” అని సినీ పరిశ్రమలో కొందరు చర్చించుకుంటున్నారు. అంతేగాక తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషలలో ఒకటి, రెండు చిత్రాలు హిట్ కావడంతో పారితోషికాన్ని అమాంతం రెండింతలు చేసిందట.

అందువల్లనే దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు ఇవ్వడం లేదని కూడా  గుసగుసలు వినిపిస్తున్నాయి.కాగా మీరా చోప్రా కజిన్ సిస్టర్స్ అయినటువంటి ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా, బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

 కానీ మీరా చోప్రా మాత్రం ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో చెప్పుకోవటానికి ఒక్క హిట్ కూడా లేక సతమతమవుతోంది.కాగా తెలుగులో మీరా చోప్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నితిన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, తెలుగు వెటరన్ హీరో వినయ్  తదితరులతో కలిసి నటించింది.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో “నాస్తిక్”  అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శైలేశ్వర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

 కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.దీంతో మొగలి పువ్వు అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి   గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube