తెలుగులో ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి “అందాల రాక్షసి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “లావణ్య త్రిపాఠి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడికి చక్కని ముఖ కవళికలు, అందం, నటనా ప్రతిభ ఎంతో ఉన్నప్పటికీ ఇప్పటివరకు తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో కొంతమేర గుర్తింపు కరువైంది.
కానీ ఆ మధ్య వచ్చినటువంటి “అర్జున్ సురవరం” చిత్రతో సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే ఈ మధ్య కాలంలో లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది.
దీంతో తాజాగా ఓ మద్యం ఉత్పత్తిదారు సంస్థ తమ మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు గాను లావణ్య త్రిపాఠి ని సంపాదించినప్పటికీ ఆమె నిర్మొహమాటంగా అలాంటి ప్రమోషన్లలో నటించని చెప్పేసిందట. ఇప్పటికే ఈ మద్యం బ్రాండ్ల ప్రకటనల్లో టాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమలకి చెందినటువంటి పలువురు సినీ నటులు పాల్గొని తమ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రమోట్ చేస్తున్నారు.
కానీ లావణ్య త్రిపాఠి మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు నిరాకరించడంతో నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఈమధ్య కాలంలో కొందరు మద్యానికి బానిసలై పూర్తిగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలాంటి వాటిని ప్రమోట్ చేసేందుకు నో చెప్పినందుకు చాలా గర్వాంగా ఉందంటూ లావణ్య త్రిపాఠి అభిమానులు అంటున్నారు.
అంతేగాక జీవితంలో డబ్బు సంపాదించడం మాత్రమే ముఖ్యం కాదని కాబట్టి సెలబ్రిటీలు డబ్బు కోసం ఇలాంటి ప్రకటనల్లో నటించడం మానుకోవాలని సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తెలుగులో ఆర్ఎక్స్ 100 చిత్ర ఫేమ్ హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న “చావు కబురు చల్లగా” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.