దయచేసి నాకు సపోర్ట్ చేయండని అంటున్న హీరోయిన్...

తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన  వసంతం అనే చిత్రంలో హీరో స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ కళ్యాణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె అసలు పేరు కావేరి.

 Telugu Actress Kalyani Sensational Comments On Her Past Life Kalyani, Telugu Ve-TeluguStop.com

 కానీ సినిమా పరిశ్రమలో ఆ పేరుతో అప్పటికే చాలా మంది ఉండటంతో కల్యాణి అని నామకరణం చేసుకుంది.అయితే తాజాగా కళ్యాణి ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.  ఇందులో తాను ఇటీవలే దర్శకురాలిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తూ ఓ చిన్న బడ్జెట్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని కాబట్టి తనని హీరోయిన్ గా ఎలా అయితే ఆదరించారో  నిర్మాతగా దర్శకురాలిగా కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

 అంతేగాక తాను ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నానని అలాగే ఈ చిత్రం సమస్యలో ఇరుక్కున్న ఓ యువతి ఆ సమస్యను ఎలా అధిగమించిందనే అంశం మీద ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకొచ్చింది.

ఇక తన వైవాహిక జీవితం విషయానికొస్తే తాను ప్రస్తుతం సంతోషంగానే ఉన్నానని తెలిపింది.

 అంతేగాక తన భర్తతో గడిపిన జీవితం గతమని ఇప్పుడిప్పుడే తాను కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నానని మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేయొద్దని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube