అలాంటి వాళ్ళు సింగిల్ గా ఉంటారంటున్న తెలుగు వెటరన్ హీరోయిన్...

తెలుగులో ఒకప్పుడు పలు చిత్రాలలో హీరోయిన్ గా మరియు సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ హీరోయిన్ నటి “ఫ్లోరా సైనీ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్త గా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పట్లో నటి ఫ్లోరా సైనీ నటించిన 143, నువ్వు నాకు నచ్చావ్, ప్రేమతో రా, నరసింహ నాయుడు, నవ్వుతూ బతకాలిరా, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి.

 Telugu Actress Flora Saini Sharing Quotation Viral In Social Media-TeluguStop.com

అయితే ఈ అమ్మడికి హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ బాలీవుడ్ పై మనసు కలగడంతో తెలుగు సినిమా పరిశ్రమని పక్కన పెట్టి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.కానీ ఈ అమ్మడికి బాలీవుడ్ లో పెద్దగా సినిమా అవకాశాలు వరించలేదు.

దాంతో మళ్లీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా నటిగా రాణించలేక పోయింది.దీంతో మొదటి ఫ్లోరా సైనీ పలు టీవీ షోలు మరియు వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టింది.

 Telugu Actress Flora Saini Sharing Quotation Viral In Social Media-అలాంటి వాళ్ళు సింగిల్ గా ఉంటారంటున్న తెలుగు వెటరన్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో నటి ఫ్లోరా సైనీ బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే రిలేషన్ షిప్ అనేది కేవలం బిగినర్స్ కి మాత్రమేనని ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు ఎప్పుడూ కూడా సింగిల్ గా ఉంటారంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది.దీంతో కొందరు నటులు ఈ విషయాన్ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

గతంలో నటి ఫ్లోరా సైనీ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ దర్శకుడితో ప్రేమలో పడింది.కానీ అనివార్య కారణాల వల్ల ఈ అమ్మడు ఆ దర్శకుడి ని పెళ్లి చేసుకోలేకపోయింది.

దీంతో మద్యం తన ప్రియుడు నుంచి తనకు ప్రాణ హాని ఉందని అలాగే తనని రోజూ మద్యం సేవించి చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని పోలీసులను కూడా ఆశ్రయించింది.దాంతో ఈ అమ్మడు తన అనుభవంతో ఓ పోస్ట్ ని షేర్ చేసిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన “రాజ్ కుంద్రా” వ్యవహారంలో నటి ఫ్లోరా సైనీ కి కూడా సంబంధాలు ఉన్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి.కానీ ఫ్లోరా సైనీ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ తాను కేవలం దర్శక, నిర్మాతలు చెప్పినట్లు పాత్ర డిమాండ్ చేయడంతో అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించాలని అంతేతప్ప తనకు అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “చద్ది” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

#ActressFlora #Flora Saini #Flora Saini #Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు