ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” దర్శకత్వం వహించిన “వేదం” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ  “దీక్షా సేథ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ మాస్ మహారాజ రవితేజ, మంచు మనోజ్, యాక్షన్ హీరో గోపీచంద్, తదితర స్టార్ హీరోల సరసన నటించింది.

 Telugu Actress Deeksha Seth Childhood Memories-TeluguStop.com

కానీ అనివార్య కారణాల వల్ల ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా  ఉండటం లేదు.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Telugu Actress Deeksha Seth Childhood Memories-ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఫోటోలో దీక్షా సేథ్ తన స్నేహితురాలితో కలిసి ఈ ఫోటోని 1998వ సంవత్సరంలో దిగినట్లు తెలిపింది.దీంతో అభిమానులు ఈ ఫోటోకి తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా చిన్నప్పుడు దీక్షా సేథ్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా దీక్షా సేథ్ తెలుగు, కన్నడ, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా పదికి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఏమైందో ఏమోగాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత ఐదు సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉంటోంది.

కాగా దీక్షా సేథ్ చివరగా “జగ్గు దాదా” అనే కన్నడ చిత్రంలో నటించింది.ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ ఈ అమ్మడు సినిమాల్లో నటించలేదు.దీంతో ప్రస్తుతం దీక్షా సేథ్ ఎక్కడుంది.? ఏం చేస్తుందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

#Deeksha Seth #DeekshaSeth #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు