తెలుగు వాళ్ళు బోల్డ్ సీన్లు చెయ్యాలంటే ఇబ్బంది పడతారు.. అందుకే ఆఫర్లు.. 

తెలుగులో ప్రముఖ దర్శకుడు అగస్త్య మంజు దర్శకత్వం వహించిన “కరోనా వైరస్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన తెలుగమ్మాయి “దక్షి గుత్తికొండ” గురించి దాదాపుగా సినిమా ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.అయితే ఈ అమ్మడు తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగువాళ్ళకి ఎందుకు సినిమా అవకాశాలు తక్కువగా ఉంటాయనే విషయం పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 Telugu Actress Dakkshi Guttikonda About Bold Scenes In Film Industry-TeluguStop.com

ఇందులో భాగంగా దక్షి గుత్తికొండ తాను చూడటానికి నార్త్ ఇండియన్ లాగా ఉంటానని అందువల్లనే తాను ఇప్పటి వరకు అవకాశాల విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలను ఎదుర్కోలేదని చెప్పుకొచ్చింది.కాగా తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగినప్పటికీ తన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారని అందువల్లనే తాను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలిపింది.

అయితే ఇక్కడి తెలుగు నటీనటులు బోల్డ్ సన్నివేశాలలో నటించాలంటే కొంతమేర సంకోచిస్తారని, ఇందుకు ముఖ్యంగా వారు తమ బంధువులు మరియు సమాజం, ఇతర అంశాల గురించి ఆలోచిస్తారని అందువల్లనే గ్లామర్ షో చేయడానికి బాగా ఇబ్బంది పడతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 Telugu Actress Dakkshi Guttikonda About Bold Scenes In Film Industry-తెలుగు వాళ్ళు బోల్డ్ సీన్లు చెయ్యాలంటే ఇబ్బంది పడతారు.. అందుకే ఆఫర్లు.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bold Scenes, Dakkshi Guttikonda, Dakkshi On Bold Scenes, Movie Offers, North India Heroines, Ram Gopal Varma, Telugu Actress, Telugu Actress Dakkshi Guttikonda About Bold Scenes In Film Industry, Tollywood-Movie

కానీ నార్త్ ఇండియా నుంచి వచ్చే నటీనటులు నటన పరంగా లేదా డాన్స్ పరంగా ఇంతకు ముందే శిక్షణ తీసుకొని నిరూపించుకోవడానికి ఇక్కడికి వస్తారని అందువల్ల వారికి సినిమా పరిశ్రమలో కొంతమేర ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది.ఇక తాను కూడా కంటెంట్ నచ్చితే గ్లామర్ షో లేదా బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి సిద్ధమేనని కూడా తన మనసులో మాట బయట పెట్టింది.

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన కొన్ని బోల్డ్ ఫోటోలను టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.

కరోనా వైరస్ చిత్రంలో చాలా బాగా యాక్ట్ చేసిందని కితాబు కూడా ఇచ్చాడు.దీంతో రామ్ గోపాల్ వర్మ పాప ని ఎంకరేజ్ చేశాడంటే కచ్చితంగా టాలెంట్ ఉంటుందని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

#DakkshiOn #NorthIndia #Bold Scenes #TeluguActress #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు