అందుకే తెలుగు హీరోయిన్లకి అవకాశాలు ఇవ్వరంటున్న యాంకర్...

తెలుగు లోపల షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ అలరిస్తున్న తెలుగు యంగ్ యాంకర్ “భాను శ్రీ” తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు మొదటగా పలు ధారావాహికలలో నటించే అవకాశాలు దక్కించుకొని బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ యాంకరింగ్ పై మనసు మళ్లడంతో ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.

 Telugu Actress Bhanu Sri Sensational Comments On Casting Couch In Film Industry,-TeluguStop.com

 అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో యాంకర్ భాను శ్రీ పాల్గొంది.ఇందులో భాగంగా సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న టువంటి లైంగిక వేధింపుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో ఇతరుల విషయం పక్కన పెడితే తాను మాత్రం  ఇప్పటివరకు ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కో లేదని స్పష్టం చేసింది. అంతేగాక తాను ఏదైనా చిత్రంలో గాని లేదా షోలో గాని నటించే ముందే అన్ని విషయాలపై క్లారిటీ గా ఉంటానని అందువల్లనే ఇప్పటి వరకు తాను ఎలాంటి క్యాస్టింగ్ యొక్క సమస్యలను ఫేస్ చేయలేదని వివరణ ఇచ్చింది.

మరోవైపు “తెలుగు హీరోయిన్లకి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాలు తక్కువ” అనే అంశంపై కూడా స్పందిస్తూ తెలుగు హీరోయిన్లు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారని ఒక్కోసారి నటన పరంగా దర్శకనిర్మాతల అంచనాలను అందుకోలేక పోవడమే కాకుండా, పలు విషయాలలో అభ్యంతరాలు ఎక్కువగా తెలుపుతారని అందువల్లనే తెలుగు హీరోయిన్లకి సినిమా అవకాశాలు తక్కువగా ఆఫర్ చేస్తారని అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు తాను కూడా సినిమా పరిశ్రమకి అందరి లాగే తన నటనా ప్రతిభను నిరూపించుకుని మంచి స్టార్ హీరోయిన్ కావాలని వచ్చానని కానీ తాను అనుకున్న దానికంటే ఇక్కడ చాలా భిన్నంగా ఉందని చెప్పుకొచ్చింది.

 అంతేకాక ఒకానొక సమయంలో తను కూడా సినిమా అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి ప్రస్తుతం వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube