దారుణం : రాత్రి సమయంలో తెలుగు నటి సోదరుడిపై కత్తులతో దాడి…  

Telugu Actress Babilona Brother Vicky Attacked By Un Known Persons - Telugu Babilona, Chennai, Criime News, Telugu Actress, Tollywood, Vicky

తెలుగులో పలు బి గ్రేడ్ చిత్రాలు మరియు స్పెషల్ సాంగ్ లలో నటించిన టువంటి నటి బాబిలోన సోదరుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిన్నటిరోజు రాత్రి సమయంలో కత్తులతో దాడి చేసిన ఘటన చెన్నై పరిసర ప్రాంతంలో కలకలం రేపింది.

 Telugu Actress Babilona Brother Vicky Attacked By Un Known Persons

వివరాల్లోకి వెళితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో బాబిలోనా సోదరుడు విక్కీ మరియు ఆమె తల్లి కలిసి నివాసం ఉంటున్నారు.

అయితే ఏమైందో ఏమోగానీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి విక్కీపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడం మొదలుపెట్టారు.దీంతో నొప్పి తాళలేక అతడు వెంటనే కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలిచాడు.

దారుణం : రాత్రి సమయంలో తెలుగు నటి సోదరుడిపై కత్తులతో దాడి…-Latest News-Telugu Tollywood Photo Image

దాంతో వెంటనే అప్రమత్తం ఐనటువంటి  స్థానికులు కత్తిపోట్లు బలంగా తగలడంతో వికీని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో తరలించారు.దీంతో భయపడిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాగా సమాచారం అందుకున్న టువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి బాధితుడు విక్కీ తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.అయితే ఈ క్రమంలో పోలీసులు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసిన పని లేక ఇతరులెవరైనా కక్ష్య సాధించే పనిలో భాగంగా దాడి చేశారా.? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test