పబ్లిక్ గా సిగరెట్ తాగుతున్న తెలుగు హీరోయిన్.. దాంతో నెటిజన్లు...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలు ఏదైనా ఓ విషయాన్ని షేర్ చేస్తే చాలు కొందరు నచ్చని వాళ్ళు వారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.అయితే తాజాగా తెలుగులో “నాటకం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి బాలీవుడ్ బ్యూటీ “అసిమా నర్వాల్”  చేసినటువంటి ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వివాదాస్పదంగా మారింది.

 Telugu Actress Ashima Narwal Cigar Smoking Video Viral In Social Media-TeluguStop.com

అయితే ఇంతకీ ఆ పోస్టు ఏంటంటే తాజాగా అసిమా నర్వాల్ సిగరెట్ తాగుతూ వీడియో తీసి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అయితే ఈ వీడియోలో అసిమా నర్వాల్ తెలుగులో బాలయ్య బాబు చెప్పేటువంటి ఫేమస్ అయిన  “ట్రబుల్ ద ట్రబుల్” అనే డైలాగ్ చెబుతూ సిగరెట్ తాగుతూ కనిపించింది.

అయితే ఇందుకు క్యాప్షన్ మాత్రం  ఓ సినిమాలోతన పాత్ర కోసం సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నానని తప్పుగా అనుకోవద్దని పెట్టింది.  దీంతో కొందరు నెటిజన్లు ఆమె చేసినటువంటి ఈ పోస్ట్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

 Telugu Actress Ashima Narwal Cigar Smoking Video Viral In Social Media-పబ్లిక్ గా సిగరెట్ తాగుతున్న తెలుగు హీరోయిన్.. దాంతో నెటిజన్లు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అంతేగాక సెలబ్రిటీ అయ్యుండి సిగరెట్ తాగుతూ ఇలా వీడియోలు పోస్టు చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా సినిమా పాత్రల కోసం అయినప్పటికీ ఇలాంటి పోస్టులు సెలబ్రిటీలు షేర్ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెంటనే ఈ పోస్ట్ డిలీట్ చేయాలంటూ సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ అమ్మడు నటించిన “నాటకం, జెస్సీ” తదితర చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ ఈ అమ్మడు తమిళంలో రెండు చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది.

#Natakam #Cigar #Ashima Narwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు