లో దుస్తులు ధరించలేదా అంటూ అసభ్యకరంగా హీరోయిన్ ని...

టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడికి నటనా ప్రతిభ, అందం, అభినయం వంటివి మెండుగా ఉన్నప్పటికీ సరైన హిట్టు పడకపోవడంతో కెరియర్ చప్పగా సాగుతోంది.

 Telugu Actress Anupama Parameswaran Bad Trolls In Social Media-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా కొందరు ఆకతాయిలు అనుపమ పరమేశ్వరన్ లా కనిపించే మరో నటి వీడియోని “మార్ఫింగ్” చేసి పలు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు.

 Telugu Actress Anupama Parameswaran Bad Trolls In Social Media-లో దుస్తులు ధరించలేదా అంటూ అసభ్యకరంగా హీరోయిన్ ని…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో ఆ నటి చపాతీలు చేస్తుండగా లైవ్ కార్యక్రమం నిర్వహించింది.దీంతో కొందరు నటి వీడియోపై స్పందిస్తూ “లో దుస్తులు” ధరించ లేదా.? అంటూ చాలా నీచంగా మాట్లాడారు.అంతేకాకుండా ఆ నటి కొంతమేర అనుపమ పరమేశ్వరన్ లా కనిపించడంతో ఈ అమ్మడిని ట్యాగ్ చేస్తూ అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

దీంతో అనుపమ పరమేశ్వరన్ ఈ విషయంపై స్పందిస్తూ అందరికీ కాళ్లు, చేతులు ఉన్న మాదిరిగానే తమకి కూడా అవి ఉన్నాయని అయినా “లో దుస్తులు”ధరించాలా, వద్దా.? అనే విషయం తమ వ్యక్తిగతమని కాబట్టి ఆ విషయంపై నిర్ణయం కూడా తమదేనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగులో “18 పేజెస్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “సుకుమార్” కథను అందించగా అతడి శిష్యుడు “పల్నాటి సూర్య ప్రతాప్” దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే టాలీవుడ్ యంగ్ హీరో “నిఖిల్ సిద్ధార్థ్” హీరోగా నటిస్తుండగా గాయత్రి ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగు ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.

#Hemangi Kavi #ABuseComments #TeluguActress #Negitive Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు