ఈ సీరియల్ హీరోయిన్ చెల్లి తెలుగులో హీరోయిన్ అని మీకు తెలుసా....?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటగా సీరియళ్ళలో నటించి ఆ తర్వాత వెండితెరపై హీరోహీరోయిన్లుగా అదృష్టం పరీక్షించుకుని సక్సస్ ఐన నటీనటులు చాలామందే ఉన్నారు.అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే “పక్కింటి అమ్మాయి” అనే ధారావాహికలలో హీరోయిన్ గా నటించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ బ్యూటీ “ప్రీతి ఆస్రాని” కూడా ఈ కోవకే చెందుతోంది.

 Telugu Actress Anju Asrani Sister Prithee Asrani News-TeluguStop.com

అయితే ప్రీతి ఆస్రాని  తన అందం, నటనతో బాగానే ఆకట్టుకోవడంతో అప్పుడప్పుడు పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు వచ్చేవి.ఈ క్రమంలో 2017వ సంవత్సరం లో తెలుగు నూతన దర్శకుడు గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహించిన “మళ్లీ రావా” చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది.

ఒక రకంగా ఈ చిత్రం ఈ ప్రీతి ఆస్రాని సినిమా కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

 Telugu Actress Anju Asrani Sister Prithee Asrani News-ఈ సీరియల్ హీరోయిన్ చెల్లి తెలుగులో హీరోయిన్ అని మీకు తెలుసా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్, ఏ-యాడ్ ఇన్ఫినిటీయం, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ అమ్మడి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.దీంతో ప్రస్తుతం ప్రీతి ఆస్రాని తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

అయితే ప్రీతి ఆస్రాని అక్క కూడా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నటి కావడంతో ఈ అమ్మడికి తెలుగులో నటిగా ఎంట్రీ సులభమే అయిందని చెప్పవచ్చు.అయితే ఇంతకీ ప్రీతి అక్క ఎవరంటే ఆమె పేరు అంజు ఆస్రాని.

కాగా అంజు అశ్రాని అప్పట్లో జెమినీ ఛానల్ లో ప్రసారమయ్యే అగ్నిపూలు మరియు మరిన్ని ఇతర ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాక ఆ మధ్య పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ లు కలిసి మల్టీస్టారర్ గా నటించిన చిత్రం “గోపాల గోపాల” లో వెంకటేష్ అక్క పాత్రలో నటించింది.

దీంతో అంజు ఆస్రాని తన చెల్లిని కూడా సినిమా ఇండస్ట్రీకి నటిగా పరిచయం చేసింది.అయితే ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ అక్క చెల్లెళ్లు పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా ప్రీతి కి చార్టెడ్ అకౌంటెంట్ కావాలని ఉందని అందువల్లనే తన చదువు కోసం బాగా కష్టపడుతుందని అంజు ఆస్రాని తెలిపింది.అలాగే సినిమా షూటింగులకి కూడా పుస్తకాలని తీసుకెళుతుందని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రీతి ఆస్రాని తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న “సీటీ మార్” చిత్రంలో కబడ్డీ జట్టు కెప్టెన్ పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రంలో యాక్షన్ హీరో గోపీచంద్ మరియు మిల్కీ బ్యూటీ తమన్నా లు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

#Prithee Asrani #Anju Asrani #Pakkinti Ammai #TeluguActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు