ఈసారైనా అంజలి సక్సెస్ అవుతుందా? లేక మళ్ళీ?

తెలుగు సినీ నటి అంజలి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తను నటించే సినిమాలలో ఈమె తన పాత్రకు ప్రాణం పోసినట్లుగా అనిపిస్తుంది.

 Anjali, Anil Ravipudi, F3 Movie, Tollywood , Vakeelsab , Svsc , Kollywood-TeluguStop.com

తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం నటించింది.ఇదిలా ఉంటే తెలుగు అమ్మాయి అయినా అంజలి తెలుగు సినీ పరిశ్రమలో అంత గుర్తింపు అందుకోలేదు కాని ఈసారైనా అంజలి తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ అవుతుందా అని వార్తలు వినిపిస్తున్నాయి.

2006లో ఫొటో సినిమాలో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత మరో సినిమాలో నటించింది.ఇక 2007లో తమిళ సినీ పరిశ్రమకు పరిచయం కాగా ఇక అక్కడే వరుస సినిమాలతో సెటిల్ అయిపోయింది.ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో మళ్లీ అడుగు పెట్టగా కొన్ని వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

ఇక మళ్లీ తమిళ సినిమాలవైపు మళ్ళగా.

Telugu Anil Ravipudi, Anjali, Tollywood-Movie

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ అడుగు పెట్టింది.ఈ సినిమా లో జరీనా పాత్రలో బాగా మెప్పించగా ప్రస్తుతం తెలుగులో మరో ఆనందభైరవి అనే సినిమాల్లో అవకాశాన్ని అందుకుంది.అంతే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్ 3 సినిమాల్లో హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మరో రెండు సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సారైనా అంజలి టాలీవుడ్ పరిశ్రమలో మంచి సక్సెస్ తో స్టార్ హీరోయిన్ గా నిలుస్తుందా లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube