సినిమా అవకాశాలు లేక వెబ్ సీరీస్ లలో నటిస్తున్న తెలుగు హీరోయిన్... 

తెలుగులో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన “యువత” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “అక్షా పార్ధసాని” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించడంతో వరుసగా సినిమా అవకాశాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని కొంతకాలం పాటు బాగానే రాణించింది.

 Telugu Actress Aksha Pardasany Got A Chance In Web Series-TeluguStop.com

కానీ అక్షా పార్ధసాని తన చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో బాక్సాఫీసు వద్ద ఎక్కువగా ఫ్లాప్ లను ఎదుర్కొంది.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడు సినిమా కెరియర్ పై పడింది.

ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు లేక ఎక్కువ సమయం ఖాళీగా గడుపుతోంది.

 Telugu Actress Aksha Pardasany Got A Chance In Web Series-సినిమా అవకాశాలు లేక వెబ్ సీరీస్ లలో నటిస్తున్న తెలుగు హీరోయిన్… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే ఈ అమ్మడు “కాట్మండు కనెక్షన్” అనే వెబ్ సీరీస్లో నటించింది… ఇందుకుగాను అక్షా పార్ధసాని దాదాపుగా 25 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

కాగా ఈ వెబ్ సిరీస్ ఈ నెల 23వ తారీకు నుంచి సోనీ లైవ్ యాప్ లో ప్రసారం కానుంది.దీంతో ఇటీవలే అక్షా పార్ధసాని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులకు తెలియజేసింది.

Telugu Aksha Pardasany, Bengal Tiger, Bollywood, Dictator, Kandireega, Kathmandu Connection, No Movie Offers, Sony Live Tv, Telugu Actress, Telugu Actress Aksha Pardasany Got A Chance In Web Series, Web Series, Yuvatha-Movie

అయితే అక్షా పార్ధసానికి తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ తరువాత గెస్ట్ అప్పియరెన్స్, రెండో హీరోయిన్, కామియో అప్పియరెన్స్, తదితర పాత్రలలో నటించడంతో ఈ అమ్మడికి క్రమక్రమంగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి.దీనికితోడు ఈ అమ్మడికంటూ సినిమా పరిశ్రమలో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో సినిమా అవకాశాల కోసం తీవ్రంగానే శ్రమించింది.అయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

అయితే ఈ అమ్మడు తెలుగులో యువత, రైడ్, కందిరీగ, డిక్టేటర్, బెంగాల్ టైగర్, రాధ, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

అలాగే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా పదికి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

#Dictator #Bengal Tiger #Aksha Pardasany #Kandireega #Yuvatha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు