సుహాస్ : ఉదయం అనుకుని మధ్యాహ్నం పెళ్లి చేసుకున్నాడంట....

తెలుగులో ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ అనే చిత్రంలో హీరో నాగ చైతన్య స్నేహితుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటుడు “సుహాస్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మజిలీ చిత్రంలో సుహాస్ నాగచైతన్యతో “మనం లవ్ లెటర్ లో రాసుకున్న అమ్మాయి పేరు వెడ్డింగ్ కార్డు మీద ఉండదు” అంటూ చెప్పే డైలాగులు ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటాయి.

 Color Photo Actor Suhas About His Marriage, Suhas, Telugu Actor, Lalitha, Color-TeluguStop.com

అయితే సుహాస్ తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఇందులో భాగంగా తన ప్రేమ కథ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తన భార్య లలిత, తాను దాదాపుగా ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని తెలిపాడు.

అలాగే తాను సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో లలిత తనకు చాలా సపోర్ట్ చేసిందని అంతేగాక కచ్చితంగా నువ్వు ఏదో ఒకరోజు గెలుస్తావని తన వెన్నుతట్టి తన పక్కన నిలబడిందని అంతలా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పుకొచ్చాడు.

అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే తన పెళ్ళికి  ఇరువురి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కానీ పెళ్లికి మాత్రం రాలేదని దాంతో తాను లలిత ఇద్దరూ కలిసి ఉదయాన్నే మాట్లాడుకొని మధ్యాహ్నం సమయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపాడు.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుత కాలంలో కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా  మంత్రోచ్ఛారణల  మధ్య పెళ్లి చేసుకున్నపెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయని కానీ ఎలాంటి వేద మంత్రాలు హడావిడి లేకుండా పెళ్లి చేసుకున్న సుహాస్, లలితలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని అందుకు కారణం వారి ఇరువురి మనసులు ముడిపడడమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో సుహాస్ నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న “కలర్ ఫోటో” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో సుహాస్ కి జోడి గా చాందిని చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube