సూపర్ సోనూ సూద్ : మొన్న ట్రాక్టర్… నేడు ఇల్లు….  

Sonu Sood, Telugu actor, homeless women, Helping Soonu Sood, New home, Sonu Sood gifted New home to Woman - Telugu Helping Soonu Sood, Homeless Women, New Home, Sonu Sood, Telugu Actor

ప్రస్తుతం కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ఒక పక్క వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు తదితర ప్రభుత్వ శాఖలు తీవ్రంగా శ్రమిస్తుంటే మరోపక్క ప్రముఖ విలక్షణ నటుడు సోను సూద్ ఈ విపత్కర కాలంలో కష్టాలు పడుతున్నటువంటి వారి కోసం చేతనైనంత సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.అయితే తాజాగా ఇటీవలే దేశంలోని  అస్సాం రాష్ట్రంలో వరదలు రావడంతో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఓ మహిళ పూరి గుడిస ధ్వంసం అయింది.

 Telugu Actor Sonu Sood Promise To The Homeless Women For New Home

దీంతో మహిళ  నిరాశ్రయారాలు అయింది.ఇది గమనించిన ఓ స్థానిక మహిళ ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసింది.

అంతేకాక సోనూసూద్ ని సహాయం చేయాలంటూ ట్యాగ్ చేసింది.

సూపర్ సోనూ సూద్ : మొన్న ట్రాక్టర్… నేడు ఇల్లు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆమె సాయం కావాలంటూ అలా ట్వీట్ చేసిందో లేదో సోనూసూద్ వెంటనే రంగంలోకి దిగి కొత్త ఇల్లు కట్టించి ఇస్తానని మాటిచ్చాడు.

అంతేగాక తన సహాయక టీమ్ సభ్యులకు ఈ విషయం గురించి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేగాక కొందరు సోనూ సూద్ అభిమానులు ఆయన  చేసినటువంటి ఈ సహాయం పై స్పందిస్తూ లెజెండ్ సినిమాలో బాలకృష్ణ చెప్పినటువంటి “అయిన వాళ్ళకి కష్టం వస్తే అర గంట ఆలస్యంగా వస్తా డెమో కానీ ఆడపిల్లకి కష్టం వస్తే సోనూసూద్ భాయ్ అర క్షణం కూడా ఆగడని వెంటనే స్పందిస్తాడని” డైలాగులు వల్లిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే వ్యవసాయం కోసం ఇద్దరు ఆడపిల్లలు కాడెద్దులు గా మారి కష్ట పడుతున్నారని తెలిసి ఏకంగా వారి ఇంటికి 10 లక్షల రూపాయల విలువ చేసే ట్రాక్టర్ ని కొనిచ్చాడు.

అలాగే సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న “శారద” అనే ఓ యువతికి వెంటనే తనకు తెలిసిన సాఫ్ట్ వేర్ కంపెనీలను సంప్రదించి ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు.ఏదేమైనా ఈ కరోనా కాలంలో మాత్రం ప్రజల చూసిన నిజమైన దేవుడు సోనుసూద్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

#Homeless Women #Sonu Sood #New Home

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actor Sonu Sood Promise To The Homeless Women For New Home Related Telugu News,Photos/Pics,Images..