డబ్బు సంపాదించడం కోసమే సినిమాల్లో నటించాను... కానీ...

తెలుగులో ఒకప్పుడు ఎర్ర బాబు, అదిరిందయ్యా చంద్రం, తాజ్ మహల్ తదితర హిట్ చిత్రాలలో హీరోగా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే శివాజీ కేవలం హీరోగా మాత్రమే కాకుండా టాలీవుడ్లోని కొంతమంది హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పి తన గొంతుని దానం చేశాడు.

 Telugu Actor Sivaji About His Cinema Career-TeluguStop.com

అయితే సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గి పోయిన సమయంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు. దీంతో బిజెపి పార్టీలో చేరి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు.

 అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Telugu Actor Sivaji About His Cinema Career-డబ్బు సంపాదించడం కోసమే సినిమాల్లో నటించాను… కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో ముఖ్యంగా తను బ్రతుకు తెరువు కోసం మొదటగా హైదరాబాద్ నగరానికి వచ్చానని, చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువుని పూర్తి చేశానని చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత చాలా ఉద్యోగాల తర్వాత సినిమా పరిశ్రమకి వచ్చి చేరానని ఈ క్రమంలో డబ్బు సంపాదించి తన తండ్రికి పొలం కొనివ్వాలనే ఉద్దేషంతో  నిర్విరామంగా సినిమాల్లో నటించానని తెలిపాడు.అయితే ఒక రకంగా చెప్పాలంటే తను డబ్బు కోసం నటించిన చిత్రాల వల్లే తన సినీ కెరీర్ ని కోల్పోవాల్సి వచ్చిందని  అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 కానీ తనకి చిన్నప్పటి నుంచి డబ్బు విలువ పెద్దగా తెలియదని అందువల్లనే డబ్బు కోసమే కొన్ని చిత్రాల్లో నటించానని కూడా చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో తాను అనుకున్న విధంగానే సినిమాల్లో నటించి వచ్చిన డబ్బుతో తన తండ్రికి పొలం కొనిచ్చానని కానీ తన ఊర్లో ఉన్నటువంటి పొలానికి బదులుగా హైదరాబాద్ నగరంలో పొలం కొని ఉంటే ప్రస్తుతం అది కోట్ల రూపాయలు విలువ చేసే ఉండేదని కానీ తాను ఏనాడు కూడా తనకంటూ స్వతహాగా ఆస్తులు కూడబెట్టుకోవాలని అనుకోలేదని చెప్పుకొచ్చాడు.

అయితే తాను అప్పట్లోనే ఎర్రబాబు అనే చిత్రంలో నటించినందుకు చాలా పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్నాని తెలిపాడు.ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పట్లో ఉండేవి కాదని కానీ ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయితే చాలు హీరో లేదా హీరోయిన్ లైఫ్ పూర్తిగా మారిపోతుందని కానీ అప్పట్లో అలా కాదని పారితోషకం పరంగా ఎన్నో ఆంక్షలు ఉండేవని కూడా తెలిపాడు.

తాను ఇప్పటివరకు దాదాపుగా 95 చిత్రాలలో నటించానని కానీ ఏ రోజు కూడా ఎప్పుడూ స్టార్ డమ్ కోసం లేదా మరే ఇతర కారణాల కోసం పని చేయలేదని కేవలం డబ్బు కోసం మాత్రమే పని చేశానని అందువల్లనే తనకి అవకాశాలు రాకపోయినా పెద్దగా ఫీల్ అవ్వనని తెలిపాడు.

#Sivaji Career #Sivaji Career #Sivaji Money #Sivaji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు