ఈ కమెడియన్ కి ఉన్న బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే అవాక్కావుతారు...

తెలుగులో కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించిన “నువ్వే కావాలి” అనే చిత్రంలో షుక్రియా అనే పదాన్ని ఉపయోగిస్తూ నటుడు శంకర్ మెల్కోటి మరియు ప్రముఖ సీనియర్ కామెడీ నటి కోవై సరళ చేసినటువంటి కామెడీ సన్నివేశాలు తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Telugu Actor Shankar Melkote Real Life And Background News, Shankar Melkote, Tel-TeluguStop.com

  ఇప్పుడు శంకర్ మెల్కోటి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు.? అసలు ఎవరు ఈ శంకర మేల్కొటి.? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే శంకర్ మెల్కోటి తెలుగులో ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన “శ్రీవారికి ప్రేమలేఖ” అనే చిత్రం ద్వారా నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. సినిమాల్లోకి రాకముందు ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ సంస్థలో పని చేసేవాడు.

అంతకంటే ముందు ఓ ప్రముఖ సినీ నిర్మాత కి సంబంధించినటువంటి లో చిట్ ఫండ్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా పని చేశాడు.ఆపై సినిమాల్లో నటించాలనే కోరిక కలగడంతో తెలిసిన వారి ద్వారా ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారిని సంప్రదించి శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

Telugu Bcci, Mvv Sreedhar, Shankar Melkote, Shankarmelkote, Telugu, Telugushanka

దీంతో అప్పటి నుంచి అడపాదడపా చిత్రాలలో నటిస్తూ బాగానే అలరిస్తున్నాడు.  అంతేగాక శంకర్ మెల్కోటి అల్లుడు ఎమ్.వివి శ్రీధర్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇండియా లో జనరల్ మేనేజర్ గా పని చేసాడు.దీంతో శంకర్ మెల్కోటి కొంతమేర ఆర్థిక పరంగా అప్పట్లోనే బాగానే ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడు.

అందువల్లే శంకర్ మెల్కోటి పలు సందర్భాలలో తాను కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు.

తెలుగులో శంకర్ మెల్కోటి నటించినటువంటి కామెడీ సన్నివేశాలను చూస్తే కడుపుబ్బ నవ్వుకోవడం మాత్రం ఖాయం.

అయితే ఇందులో దూకుడు, నువ్వు నాకు నచ్చావ్, నేను, సంతోషం, తదితర చిత్రాలలోని కామెడీ సన్నివేశాలు శంకర్ మెల్కోటికి మంచి గుర్తింపు తెచ్చాయి. కాగా తెలుగులో శంకర్ మెల్కోటి దాదాపుగా 50 కి చిత్రాలలో నటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube