కష్టాల్లో ఉన్నాం.... సాయం చేయమని హీరో అజిత్ ని అడిగితే... అది మీ ప్రాబ్లం అంటూ...- Telugu Actor Sameer Sensational Comments On Tamil Actor Ajith Goodness

Telugu Actor Sameer Sensational comments on Tamil actor Ajith Goodness, Sameer, Telugu Actor, Ajith Kumar, Tamil actor, jr NTR, Tollywood, - Telugu Ajith Kumar, Jr Ntr, Sameer, Tamil Actor, Telugu Actor, Telugu Actor Sameer Sensational Comments On Tamil Actor Ajith Goodness, Tollywood

సినిమా పరిశ్రమలో తమిళ ప్రముఖ హీరో అజిత్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే మొదట్లో అజిత్ తెలుగులో ప్రేమ పుస్తకం అనే చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయినప్పటికీ తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో తన చిత్రాలకి మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు.

 Telugu Actor Sameer Sensational Comments On Tamil Actor Ajith Goodness-TeluguStop.com

అయితే అజిత్  హీరోగా నేను మాత్రమే కాకుండా తన నిజ జీవితంలో కూడా చాలా మందికి సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు.అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు సమీర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హీరో అజిత్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తనకి అజిత్ చాలా మంచి స్నేహితుడని దాంతో అప్పట్లో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళమాని ప్రస్తుతం అజిత్ తన కెరీర్ లో బిజీ అవడంతో తాను కూడా తన కెరీర్ లో బిజీ అయ్యానని దాంతో ఈ మధ్య పెద్దగా కలవడం లేదని తెలిపాడు. ఇక అజిత్ మంచితనం గురించి వివరిస్తూ అజిత్ హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్ పనులు తాను నటిస్తున్న  చిత్ర షూటింగ్ పనులు ఒకే ప్రాంతంలో జరుగుతుండడంతో తాను అజిత్ ని కలవడానికి వెళ్లానని తెలిపాడు.

 Telugu Actor Sameer Sensational Comments On Tamil Actor Ajith Goodness-కష్టాల్లో ఉన్నాం…. సాయం చేయమని హీరో అజిత్ ని అడిగితే… అది మీ ప్రాబ్లం అంటూ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే ఇందులో అజిత్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ సహ నిర్మాత ఆర్టిస్టులకు మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు డబ్బులు సరిగ్గా చెల్లించడం లేదని దాంతో ఈ విషయం గురించి వారు తమకి సహాయం చేయాలని అజిత్ దగ్గరికి వెళ్లి చెప్పగా అజిత్ చాలా సింపుల్ గా “ఇది మీ వ్యక్తిగత విషయం అని నేను ఎలాంటి సహాయం చేయలేనని” చెప్పాడట.

ఆ తర్వాత వెంటనే షూటింగ్ స్పాట్ నుంచి హోటల్ కి వెళ్ళి పోయాడట.

దీంతో నిర్మాత అజిత్ కి ఫోన్ చేయడంతో వెంటనే చిత్ర యూనిట్ సభ్యులకు చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తేనే షూటింగ్ కి హాజరవుతానని తెగేసి చెప్పాడట.ఒకవేళ తాము చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే తాను ఆ డబ్బులు చెల్లిస్తానని తర్వాత తనకి తిరిగి ఇవ్వండని కూడా చెప్పాడట.

అయితే మొదట్లో సహాయం చేయలేనని తెగేసి చెప్పినటువంటి అజిత్ ఆ తర్వాత అతడి వల్లే డబ్బులు తిరిగి వచ్చాయని కొందరు చిత్ర యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని సమీర్ చెప్పుకొచ్చాడు.అంతేగాక అజిత్ నిజ జీవితంలో కూడా చాలా సింపుల్ గా ఉంటాడని అందువల్లే  అజిత్  క్యారెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా తెలిపాడు.

ఇక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా తనకు చాలా మంది హీరోలు స్నేహితులుగా ఉన్నారని కానీ ఎప్పుడూ కూడా అవకాశాల కోసం తన స్నేహితుల వద్ద చేయు చాపడం తనకు ఇష్టం ఉండదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఇందుకు ఉదాహరణగా టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు చాలా ఆప్త మిత్రుడని కానీ ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ ని అవకాశాలు ఇప్పించమని అడగలేదని తెలిపాడు.

అయితే ఈ విషయంలో ఉండగా ప్రస్తుతం సమయం తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తున్నాడు.

#TeluguActor #Tamil Actor #Jr NTR #Ajith Kumar #Sameer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు