మా ఎన్నికలు : అతడు గెలిస్తే అద్భుతాలు జరుగుతాయి...

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో రోజురోజుకీ వేడి పెరుగుతోంది.కాగా ఇప్పటికే ఈ ఎన్నికల అధ్యక్షుడే బరిలో తెలుగు ప్రముఖ సీనియర్ నటుడు మరియు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు “మంచు విష్ణు” కూడా బరిలో దిగుతున్నాడు.

 Telugu Actor Sameer About Prakash Raj Manifesto In Maa Elections, Telugu Actor,-TeluguStop.com

అలాగే తెలుగు ప్రముఖ నటుడు “ప్రకాష్ రాజ్” కూడా ఈ అధ్యక్ష పదవి బరిలో ఉన్నాడు.దీంతో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో మెంబర్ గా ఉన్న ప్రముఖ నటులు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ గెలిస్తే కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మంచి జరుగుతుందని తెలిపాడు.అంతేకాకుండా సభ్యులకు కూడా చాలా ఉపయోగాలు ఉంటాయని కాబట్టి ప్రకాష్ రాజ్ ని ఎన్నుకోవడం మన బాధ్యత అంటూ తెలియజేశాడు.

అయితే ప్రకాష్ రాజ్ ఇప్పటికే మూవీ ఆర్టిస్టులకి మంచి చేసేందుకు కంకణం కట్టుకోవడమే కాకుండా ఆచరణలోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపాడు.అలాగే సీనియర్ నటి మరియు దర్శకురాలు జీవిత కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మద్దతు తెలిపిందని దాంతో తమ ప్యానెల్ కి మరింత బలం చేకూరిందని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా సినిమా ఆర్టిస్టులకి ఏదైనా కష్టం వస్తే దర్శకురాలు జీవిత మరియు ప్రముఖ హీరో రాజశేఖర్ కచ్చితంగా తమకు తోచినంత సహాయం చేస్తూ ఆదుకుంటారని ఈ క్రమంలో ఇప్పటివరకు చాలా మందికి సహాయం చేశారని కూడా తెలిపాడు.

Telugu Jeevitha, Maa, Artist, Prakash Raj, Sameer, Telugu, Telugusameer-Movie

ఇక గతంలో తాము ప్రస్తుత అధ్యక్షుడయిన నరేష్ ని నమ్మి గెలిపించామని కానీ గెలిచిన తర్వాత నరేష్ వ్యవహారంలో చాలా మార్పులు వచ్చాయని అంతేకాకుండా తన కార్యాచరణ గురించి కనీసం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీ తో కూడా పెద్దగా చర్చించేవాడు కాదని అందువల్లనే ఈ సారి అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నటుడు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపాడు.ఇక మంచు మోహన్ బాబు గురించి స్పందిస్తూ మోహన్ బాబు తో పెద్దగా పరిచయం లేదని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube